Chicken: ఈ చిన్న టెస్ట్ తెలిస్తే ఇంకెప్పుడూ పాడైన చికెన్ ఇంటికి తీసుకొని రారు… సీక్రెట్ మీకోసం…

చికెన్ అంటే చాలామందికి ఇష్టమైన వంటకం. ముఖ్యంగా ఆదివారం వచ్చినా, చిన్న సెలవు వచ్చినా, ఇంట్లో ప్రత్యేక భోజనం చేయాలంటే చికెన్ ఉండాల్సిందే. కుటుంబం మొత్తం కూర్చొని వండిన చికెన్ కర్రీ తింటూ నవ్వులు పంచుకుంటే ఆ క్షణాలు మరపురానివి. కానీ ఈ ఆనందాన్ని అర్ధాంతరంగా నిలిపేసే ప్రమాదం ఏమిటంటే… మీరు కొన్న చికెన్ ఫ్రెష్ కాదు అంటే? చెడిపోయిన చికెన్ వాడితే ఆరోగ్యానికి ప్రమాదమే. కాబట్టి, చికెన్ నిజంగా తాజాదేనా లేదా అనేది మనమే గుర్తించాలి. దుకాణంలో చికెన్ కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనిస్తే, మీరు ఎప్పుడూ బంగారం లాంటి ఫ్రెష్ చికెన్‌ను తినవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఫ్రెష్ చికెన్ ఎలా గుర్తించాలో, చెడిపోయినదైతే ఎలా గుర్తించాలో, చిన్న చిన్న టెస్టులతో మనం ఎలా తెల్సుకోగలమో ఈపోస్టులో వివరంగా చదిద్దాం. ఇవే విషయాలు మాక్కాదు, మీ కుటుంబ ఆరోగ్యానికీ అత్యంత అవసరం.

చికెన్‌ను చూస్తే, ముందుగా దాని రంగు చెక్ చేయాలి. నిజంగా తాజా చికెన్ చూస్తే అది లేత గులాబీ రంగులో ఉంటుంది. అది ఆరోగ్యంగా ఉన్న కోడి మాంసం అనే సూచన. పైనున్న చర్మం కూడా చల్లగా, మృదువుగా ఉంటుంది. కానీ అదే పచ్చగా కనిపిస్తే… లేదా రంగు మరుగుగా అనిపిస్తే… అది పాత చికెన్ అని అర్థం. కొన్నిసార్లు కోడి చర్మంపై ఆకుపచ్చ పదార్థం వస్తుంది. అది ఫంగస్ కావచ్చు. అలాంటి చికెన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి.

రంగుతోపాటు మాంసం టెక్స్చర్‌ను కూడా గమనించాలి. చేతితో మాంసాన్ని తాకినప్పుడు గట్టిగా ఉండాలి. ఆ ముక్క పిండితే తిరిగి ముందు ఆకారానికి వచ్చేయాలి. అదే మాంసం మెత్తగా, గజిబిజిగా ఉంటే… అది చెడిపోయినది. కొద్దిగా ఒత్తితే విరిగి పడిపోతే అది కూడా ఫ్రెష్‌ కాదు. కొన్నిసార్లు ఫ్రిడ్జ్‌లో ఎక్కువ గంటలపాటు నిలిపిన మాంసం ఇలా మారుతుంది. వాసన కూడా ఫ్రెష్ మాంసానికి ఒక గుర్తు. మామూలు వాసన వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఒకింత దుర్వాసన వస్తే లేదా గుడ్లను కుళ్ళినట్లుగా అనిపిస్తే వెంటనే పక్కన పెట్టేయండి. అలాంటి చికెన్‌ను వండితే కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి హాని.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మాంసాన్ని చేతితో నొక్కినప్పుడు నీరు వస్తున్నదా అని చూడాలి. కొన్నిసార్లు మాంసానికి నీళ్లు ఇంజెక్ట్ చేసి బరువు పెంచి విక్రయిస్తారు. అంతే కాదు, పాత మాంసాన్ని మళ్లీ గోరుముద్ద చేసి తాజాగా కనిపించేలాగా చేస్తారు. చేతితో నొక్కినప్పుడు ఎక్కువగా నీరు కారితే అది అసలు ఆరోగ్యకరమైన మాంసం కాదు. అంతే కాదు, వండిన తర్వాత కూడా మాంసం గట్టిగా ఉండాలి. చాలా సార్లు వండుతున్నపుడు చికెన్ ముక్కలు మెత్తబడి కూరలో కలిసిపోతే… అది పాత మాంసం అని అర్థం.

మీరు మాంసం కొనే చోట కూడా చాలా ముఖ్యం. తెలిసిన మీట్ షాప్ లేదా హైజీన్ పాటించే చోట నుంచి మాత్రమే కొనాలి. మాంసాన్ని ఫ్రెష్‌గా కోసి ఇవ్వడం, రక్తం పూర్తిగా తొలగించి క్లీన్ చేసి ఇవ్వడం అనేది చాలా అవసరం. అప్పుడే వండిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మాంసాన్ని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎక్కువసేపు బయట ఉంచితే మాంసం త్వరగా పాడైపోతుంది. వేడి వాతావరణంలో మాంసం వాసన మారిపోవచ్చు. మీరు వండేలోపు కూడా అది చెడిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వండితే ఆరోగ్య సమస్యలు తప్పవు.

ఇప్పటికే చెడిపోయిన చికెన్ తింటే శరీరంలో ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించవచ్చు. ఎడతెగని వాంతులు, విరేచనాలు, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువ రిస్క్‌లో ఉంటారు. కాబట్టి ఒక్కసారి మాంసాన్ని జాగ్రత్తగా చెక్ చేయడం మీ కుటుంబాన్ని అనారోగ్యం నుంచి కాపాడుతుంది.

వంట చేసే ముందు మాంసాన్ని కడగడం కూడా తప్పనిసరి. చల్లటి నీటిలో మంచి లెమన్ జ్యూస్ లేదా ఉప్పుతో కడిగితే బాక్టీరియా తగ్గుతుంది. అలాగే వండేటప్పుడు సరిగ్గా ఉడికించాలి. మసాలాలు వేసి, పూర్తిగా మాంసం ఉడికిన తర్వాతే గ్యాస్ ఆఫ్ చేయాలి. అప్పుడే ఆరోగ్యకరమైన వంటకాన్ని ఆస్వాదించవచ్చు.

చివరిగా చెప్పాలంటే, చికెన్ తీసుకునేటప్పుడు ఒక్క నిమిషం జాగ్రత్తగా గడిపితే మీ కుటుంబానికి ఆరోగ్యంగా, రుచిగా ఉండే భోజనం సిద్ధమవుతుంది. వాసన చూసి, రంగు గమనించి, టెక్స్చర్‌ చెక్ చేసి, నీరు కారుతున్నదేమో చూసుకుంటే – మీరు ఎప్పుడూ ఫ్రెష్ చికెన్‌నే తీసుకుంటారు. ఇప్పుడు మీరు కూడా ఈ చిన్న ట్రిక్స్ పాటించి చూడండి, ఇకపై ఒక్కసారి కూడా చెడిపోయిన చికెన్ మీ ఇంటికి రాదు.

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతీసారి చికెన్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. తప్పక షేర్ చేయండి – అందరకీ ఉపయోగపడాలి!