
ఇప్పట్లో ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా భద్రతగా ఉండాలని చూస్తున్నారు. కానీ చాలామందికి ఒక అపోహ ఉంది. మంచి భవిష్యత్ కోసం ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి అని. కానీ ఇది తప్పు. ఎందుకంటే మన దగ్గర ఒక శక్తివంతమైన ఎంపిక ఉంది – అదే SIP, అంటే Systematic Investment Plan. SIP ద్వారా మీరు నెలకు కేవలం ₹500 పెట్టుబడి పెడితే కూడా భారీగా డబ్బు కూడగట్టుకోవచ్చు. ఇది చిన్న చిన్న సేవింగ్స్ తో పెద్ద ఫలితం ఇచ్చే మార్గం.
SIP అనేది ఒక పద్ధతిగా నెలవారీగా కొన్ని రూపాయలు పెట్టుబడి పెట్టడం. ఇది స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా జరుగుతుంది. ఇందులో మీరు ఎన్నుకున్న ఫండ్ రకం ఆధారంగా లాభాలు వస్తాయి. SIP లో ముక్యంగా మార్కెట్ వృద్ధి, తగ్గుదలల ప్రభావం తక్కువగా ఉండటమే పెద్ద లాభం. ఎందుకంటే మీరు ప్రతి నెలా ఒకే మొత్తాన్ని పెట్టడంవల్ల, మార్కెట్ తగ్గినప్పుడు ఎక్కువ units వచ్చేస్తాయి. తర్వాత మార్కెట్ పెరిగినప్పుడు అవే ఎక్కువ లాభాన్ని ఇస్తాయి.
మనమొక ఉదాహరణ తీసుకుందాం. మీరు నెలకు ₹500 చొప్పున SIPలో పెట్టుబడి పెడుతున్నారని అనుకోండి. మొత్తం 5 సంవత్సరాల పాటు అంటే 60 నెలల పాటు మీరు ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు మొత్తం పెట్టుబడి ₹30,000 అవుతుంది. ఇది ఏటా సగటున 12% రాబడి ఇస్తుందనుకుంటే, 5 ఏళ్లకు మీకు వచ్చే మొత్తం సుమారు ₹42,000. అంటే మీరు వేసిన ₹30,000తోపాటు ₹12,000 లాభం కూడా వస్తుంది. ఇది అన్ని ఖర్చులు మినహాయించిన తర్వాత లభించే మొత్తమే.
[news_related_post]చాలామందికి డౌట్ – SIP అంటే స్టాక్ మార్కెట్ సంబంధించిందే కదా, డబ్బు పోతుందేమో అని. కానీ నిజం ఏమిటంటే SIP ద్వారా మీరు చిన్న మొత్తాలు మాత్రమే పెట్టుబడి పెడతారు. ఇవి మార్కెట్ తీవ్రంగా పడిపోయినప్పుడు కూడా పెద్దగా నష్టమివ్వవు. పైగా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెట్టుబడి చేసే ఫండ్స్ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా వేరుగా ఉంటాయి. మీరు ఎక్విటీ ఫండ్ ఎంచుకుంటే అది మార్కెట్‌తో నేరుగా సంబంధం ఉండే ఫండ్. దీంట్లో రిస్క్ ఎక్కువ. కానీ లాభాలు కూడా ఎక్కువ. ఇక డెబ్ట్ ఫండ్ తీసుకుంటే రిస్క్ తక్కువ, లాభాలు తక్కువ. మీరు మీ లక్ష్యానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు.
ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే, SIP ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. మార్కెట్ పడినప్పుడు కూడా మీరు పెట్టుబడి పెడతారు కాబట్టి, అప్పుడు ఎక్కువ units వస్తాయి. ఈ units తర్వాత మార్కెట్ పెరిగినప్పుడు మంచి returns ఇస్తాయి. దీన్ని రూపీ కాస్ట్ ఎవరేజింగ్ (Rupee Cost Averaging) అంటారు.
SIP ద్వారా మీరు 5 ఏళ్లకే కాదు, 10–15 ఏళ్ల పాటు క్రమంగా పెట్టుబడి పెడితే మరింత పెద్ద ఫండ్ నిర్మించవచ్చు. దీని వలన పెన్షన్, పిల్లల విద్య, లేదా భవిష్యత్తులో అవసరమైన ఏదైనా ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించవచ్చు. అలాగని ఇది బ్యాంకు FD లాంటిదేమీ కాదు. స్టాక్ మార్కెట్‌కి సంబంధం ఉండటం వలన లాభాలు గ్యారంటీగా ఉండవు. కానీ గత ట్రాక్ రికార్డును చూస్తే, SIPలు చాలా కాలంగా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయని నిరూపితమైందే.
నిజంగా మీ భవిష్యత్తు కోసం SIP ఒక సులభమైన దారి. మినిమం నెలకు ₹500 చొప్పున మీరు ప్రారంభించవచ్చు. అవసరమైతే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. దీని వలన మీరు నెలల తరబడి పెట్టుబడి పెడుతూ పెద్ద ఫండ్ పొందవచ్చు. చివరగా చెప్పాలంటే, SIP అనేది ఒక “చిన్న దారిలో ప్రారంభం చేసి పెద్ద లక్ష్యం చేరుకునే మార్గం”. మీరు కూడా ఇప్పుడు ఓ నిర్ణయం తీసుకోండి.