
ప్రస్తుతం జీతం తీసుకునే ఉద్యోగులకు ఒక గొప్ప వార్త. ఉద్యోగ విరమణ తర్వాతే provident fund డబ్బు తీసుకోవచ్చని మనకు తెలిసిన విషయం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా పీఎఫ్ నిబంధనలు మార్చబోతుందట. దీని వల్ల చాలా ఉద్యోగులకు మధ్యలోనే డబ్బులు అవసరమయ్యే సమయంలో పెద్ద ఊరట లభించనుంది.
ఇప్పుడు ఉద్యోగి పని నుంచి రిటైర్ అయిన తర్వాత లేదా ఉద్యోగం మానేసి రెండు నెలలు దాకా నిరుద్యోగంగా ఉన్నప్పుడు మాత్రమే పీఎఫ్ మొత్తాన్ని తీసుకోవచ్చు. అలాగని మధ్యలో డబ్బు తీసుకోలేరా అంటే, తీసుకోవచ్చు. కానీ అది ఇంటి కొనుగోలు, వైద్య అవసరాలు, పిల్లల చదువు లేదా పెళ్లికి మాత్రమే అనుమతిస్తారు. ఈ అవసరాలకు కొంత శాతం మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది.
లీకైన సమాచార ప్రకారం, ఈ కొత్త నిబంధనలతో 10 సంవత్సరాలకు ఒక్కసారి పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే అవకాశం కల్పించనున్నారు. దీని వల్ల మీరు ఉద్యోగం చేస్తూనే ఉంటూ, మీ అవసరాలను తీర్చుకోవచ్చు. ఈ ప్రతిపాదన అమలైతే, మీరు 30 ఏళ్ల వయస్సులోనూ పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.
[news_related_post]అయితే పూర్తిగా మొత్తం కాదు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం, మీరు 60 శాతం వరకు డబ్బును తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతం మాత్రం రిటైర్ అయ్యే వరకు ఉండాల్సి వస్తుంది. ఇది middle-age లో ఉన్న వారికి చాలా ఉపయోగపడే మార్పు. అవసరాల కోసం లోన్ తీసుకోవడం కాకుండా, మన సొంత డబ్బుతోనే అవసరాలను తీర్చుకోవచ్చు.
ఇకపోతే, ఇటీవలే EPFO మరో సులభతరం చేసిన మార్పు కూడా తీసుకువచ్చింది. ఇప్పటికే మూడు సంవత్సరాల పాటు పీఎఫ్‌లో సేవింగ్స్ ఉన్నవారు, ఇప్పుడు 90 శాతం వరకు డబ్బు తీసుకొని ఇంటిని కొనుగోలు చేయవచ్చు లేదా నిర్మించుకోవచ్చు. మునుపు ఈ అవకాశం ఐదేళ్ల పాటు సేవింగ్స్ ఉన్న వారికి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ గడువు మూడేళ్లకు తగ్గించారు. ఇది middle-class కి చాలా ఉపయోగపడుతుంది.
ఇక ముందు ఒక లక్ష రూపాయల వరకు మాత్రమే ఆడ్వాన్స్ క్లెయిమ్‌కి అనుమతి ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ. 5 లక్షల వరకు పెంచారు. అంతే కాదు, ఈ మొత్తం కోసం ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. జూన్ 24న విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యవసర సమయంలో సభ్యులకు త్వరగా డబ్బు లభించేందుకు తీసుకున్న నిర్ణయంగా చెప్పింది EPFO.
ప్రస్తుతం EPFO సభ్యుల సంఖ్య 7.4 కోట్లకు పైగా ఉంది. ఈ పీఎఫ్ ఫండ్‌లో మొత్తం రూ. 25 లక్షల కోట్ల వరకు డబ్బు ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద లాంగ్‌టెర్మ్ సేవింగ్స్ పథకం అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ మార్పులతో ఉద్యోగులు వారి భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే ప్రణాళిక చేసుకునే అవకాశం లభించనుంది.
ఇంకా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ మార్పులను ప్రకటించలేదు. ఇది పాలసీ మార్పుల దశలో ఉంది. కాబట్టి వచ్చే నెలలలో దీనిపై స్పష్టత రానుంది. కానీ ఇప్పటి నుంచే మీరు పీఎఫ్ పథకం గురించి వివరంగా తెలుసుకుని, మీ అవసరాలను బట్టి ప్రణాళిక చేసుకోవచ్చు.
ఈ మార్పులు వచ్చిన తర్వాత, ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును మరింత తెలివిగా వాడుకునే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్కి వేచిచూసే రోజులు పోయాయి. అవసరానికి సరిపోయే విధంగా మనకున్న డబ్బు మనే వాడుకునే హక్కు ఇప్పుడొస్తుంది!
ఈ కొత్త నిబంధనలు నిజంగానే అమలులోకి వస్తే, ప్రతి ఉద్యోగికి ఇది స్వర్ణావకాశం. అవసరమైన సమయంలో ముందుగా పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంటి కోసం, ఆరోగ్య ఖర్చులకు, పిల్లల చదువు కోసం – లక్షల రూపాయల వరకు ఉపసంహరణ సాధ్యమే. ఇక దాచుకున్న డబ్బు పనికిరానిదిగా ఉండాల్సిన అవసరం లేదు. FOMOకి గురవకుండా, ఇప్పుడే మీ పీఎఫ్ స్టేటస్ చెక్ చేయండి, ఏ మార్పైనా మిస్ కాకుండా ఉండండి.