
భారతీయుల జీవితంలో ఆధార్ కార్డు అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. నిత్యం వినియోగించే పత్రాల్లో ఆధార్ కార్డు ఒకటి. బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నా, లోన్ పొందాలన్నా తప్పనిసరిగా ఈ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు లేకుండా ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర పథకం ప్రయోజనాలను పొందలేరు. అంత కీలకమైన డాక్యుమెంట్ గా ఆధార్ కార్డు మారిపోయింది.
సాధారణంగా ఆధార్ కార్డులో పేరు, జెండర్, అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి. మొదటిసారి కార్డు తీసుకున్నప్పుడు మీకు తెలియకుండానే ఆధార్ లో తప్పులు దొర్లి ఉండొచ్చు. అందుకే మీరు ఆధార్ కార్డులో ఉన్న తప్పులను సరిచేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేదంటే ప్రభుత్వ పథకాలు, ఇంకే అవసరాల కోసం ఆధార్ వాడినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఆధార్ కార్డులలో వివరాలను ఎన్నిసార్లు మార్చుకోవచ్చు? ఆధార్ కార్డులో పేరు మార్చడానికి నియమాలు ఏమిటి? పుట్టిన తేదీని ఎన్నిసార్లు సవరించవచ్చు? తదితర విషయాలు తెలుసుకుందాం.
పేరు : ఆధార్ కార్డుపై ఉన్న పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు. అందుకు పాస్ పోర్ట్, వివాహ ధ్రువీకరణ పత్రం, పాన్ కార్డ్, ఓటరు ఐడీ లేదా ఏదైనా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు అవసరం.
[news_related_post]పుట్టిన తేదీ :పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పిస్తోంది.
అడ్రస్ (చిరునామా) : చిరునామా మార్చుకోవడం పై యూఐడీఏఐ ఎలాంటి పరిమితి పెట్టలేదు. అయితే, అడ్రస్‌ను ధ్రువీకరిస్తూ పత్రాలు సమర్పించాలి. UIDAI అధికారిక వెబ్సైట్లో మీరే స్వయంగా మీ చిరునామాను సవరించుకోవచ్చు.
జెండర్: పుట్టిన తేదీలాగే, ఆధార్ కార్డులోని జెండర్‌ను కూడా ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ఫొటో- ఆధార్ కార్డుపై ఉండే ఫొటోను మార్చుకోవడంపై యూఐడీఏఐ ఎలాంటి పరిమితి విధించలేదు. దగ్గరలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి ఫొటోను అప్డేట్ చేసుకోవచ్చు. అందుకు రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో ఫొటోను మార్చడం మాత్రం కుదరదు.
ఈ-మెయిల్, మొబైల్ నంబర్: ఆధార్ కార్డులోని ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ను మార్చుకోవడానికి ఎటువంటి పరిమితి లేదు. ఆధార్ సేవా కేంద్రంలో మొబైల్ నంబర్, ఈ-మెయిల్ సంస్థను ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. అయితే ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి. అప్పుడే ఓటీపీ వస్తుంది.
పరిమితికి మించి మార్పులు చేయాలంటే ఎలా? ఆధార్ కార్డుపై ఉన్న పేరు పుట్టిన తేదీ, జెండర్ వివరాలు, పరిమితికి మించి మార్చడానికి ఛాన్స్ లేదు. ఒక వేళ పరిమితి దాటిన తర్వాత మార్పులు చేయాలనుకుంటే ప్రత్యేక పద్ధతిని ఫాలో అవ్వాలి. పరిమితికి మించి మార్పులు చేయాలనుకున్నప్పుడు మొదట ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాలి. పరిమితి మంచి సవరణలు జరుగుతున్న నేపథ్యంలో అప్డేట్ను స్వీకరించమని ప్రత్యేకంగా మెయిల్ చేయాలి. ఆధార్ వివరాలను ఎందుకు మార్చాల్సి వస్తుందో స్పష్టంగా తెలియజేయాలి. అలాగే దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్‌లను సమర్పించాలి. అలాగే help@uidai.gov.in.వెబ్ సైట్లోనూ అప్లై చేసుకోవచ్చు. సంబంధిత అధికారులు మీ విజ్ఞప్తిని క్షుణ్ణంగా పరిశీలించి మార్పు సమంజసమని భావిస్తే అందుకు అనుగుణంగా మార్పులకు అవకాశం ఇస్తారు. లేదంటే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అవుతుంది.