ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచడంతో మొబైల్ వినియోగదారులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. రోజూ ఉపయోగించే డేటా, కాల్స్ కోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తోంది. అలాంటి సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తక్కువ ధర, ఎక్కువ ప్రయోజనాలతో వినియోగదారుల హృదయాలను గెలుస్తున్న BSNL ప్లాన్‌లపై ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది.
మీరు BSNL వినియోగదారైతే, ఇప్పుడు అందుబాటులో ఉన్న ₹485 ప్రీపెయిడ్ ప్లాన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో అందించే వాలిడిటీ, డేటా, కాలింగ్ లాంటి లాభాలు చూస్తే ఎవరికైనా ఓ మారు ఆశ్చర్యం కలగకమానదు. ప్రధానంగా ఈ ప్లాన్ వాలిడిటీ 80 రోజులు. అంటే రెండు నెలలకి పైగా చక్కగా వాడుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ 80 రోజులపాటు మీరు అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా, ఫ్రీగా మాట్లాడేయొచ్చు.
ఈ ప్లాన్‌లో రోజుకి 2GB డేటా లభిస్తుంది. అంటే మొత్తం 160GB డేటా లభిస్తుంది. ఇది చాలా పెద్ద సంఖ్య. మీరు సోషల్ మీడియా చూడాలి, వీడియోలు చూడాలి, ఆన్‌లైన్ క్లాస్‌లు వినాలి అనుకుంటే ఈ డేటా చాలు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ 2GB డేటా అయిపోయినా ఇంటర్నెట్ పనిచేస్తూనే ఉంటుంది. స్పీడ్ మాత్రం 40 kbpsకి తగ్గుతుంది. కానీ చిన్న పనులకు అది కూడా ఉపయోగపడుతుంది.
Related News
ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMSలు ఉచితంగా పంపించవచ్చు. ప్రస్తుతం OTPలు, బ్యాంకింగ్ మెసేజ్‌లు ఎక్కువ అవసరం కావడంతో ఈ సౌకర్యం చాలా పనికొస్తుంది. ప్రతిరోజూ డేటా, కాలింగ్, SMS అన్నీ ఉచితంగా లభించటం నిజంగా ప్రత్యేకం.
ఈ ప్లాన్‌ను చూసినప్పుడు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, రోజుకి కేవలం ₹6.06 మాత్రమే ఖర్చవుతుంది. అంటే ఒక్క కాఫీ ధరకంటే తక్కువగా రోజంతా మొబైల్ వాడుకోవచ్చు. ఇది వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరం.
BSNL మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇది ₹198 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్‌ను తీసుకుంటే 40 రోజుల వాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2GB డేటా ఇందులో కూడా లభిస్తుంది. ఇది కూడా మొత్తం 80GB డేటా అవుతుంది. డేటా ముగిసిన తరువాత స్పీడ్ 40 kbpsకి తగ్గుతుంది కానీ ఇంటర్నెట్ ఆగదు. ఈ ప్లాన్ కూడా మీ బడ్జెట్‌కు తగ్గది.
BSNL అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో బెస్ట్ ప్లాన్‌లుగా నిలుస్తున్నాయి. తక్కువ ధర, ఎక్కువ లాభాలు, ఎక్కువ వాలిడిటీ, బంపర్ డేటా అన్నీ కలిపి వినియోగదారుల అవసరాలకు పర్ఫెక్ట్‌గా సరిపోతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలు ధరలు పెంచిన తర్వాత ఈ ప్లాన్‌లు మరింత ఆకర్షణీయంగా మారాయి.
ప్రస్తుతం మీరు BSNL వినియోగదారైతే వెంటనే ఈ ప్లాన్‌లలో ఏదో ఒకటి రీఛార్జ్ చేసుకోండి. ఇప్పుడు మిస్ అయితే తర్వాత దురదృష్టం అంటుకుంటుంది. చక్కటి ఆఫర్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవటం తెలివైన నిర్ణయం. మీ డబ్బును పొదుపుగా వినియోగించుకుంటూ మొబైల్ సర్వీసులు పూర్తిగా పొందాలంటే BSNL ప్లాన్‌లకంటే మెరుగైనవి లేవు.
ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వెంటనే ₹485 లేదా ₹198 ప్లాన్‌లో ఏదైనా ఒక్కటి ఎంచుకుని రీఛార్జ్ చేసుకోండి. మీ డబ్బు ఆదా చేయండి, రోజూ మొబైల్ ను ఆనందించండి…