Jio: 49 కోట్లకు పైగా యూజర్లకు జియో గేమింగ్ షాక్… కొత్త రీఛార్జ్ ప్లాన్లలో హాట్‌స్టార్, 5G, క్లౌడ్ ఫ్రీ…

రిలయన్స్ జియో దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద టెలికాం కంపెనీలలో ఒకటి. 49 కోట్లకుపైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉండే ఈ కంపెనీ తాజాగా మరో బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. జియో తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్తగా ఐదు రీఛార్జ్ ప్లాన్లను విడుదల చేసింది. ఇది ప్రతి జియో యూజర్‌కి ఖచ్చితంగా హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా గేమింగ్ ప్రేమికులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అవుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ సారి జియో తన ప్లాన్లలో గేమింగ్ క్యాటగిరీని ప్రత్యేకంగా ప్రారంభించింది. అంటే ఇకపై గేమర్ల కోసం ప్రత్యేక ప్లాన్లు ఉంటాయి. ఈ ఐదు కొత్త ప్లాన్లలో మూడు ప్లాన్లు అడాన్ ప్లాన్లుగా ఉంటే, మిగతా రెండు పూర్తిస్థాయి డేటా మరియు వాయిస్ ప్లాన్లుగా ఉంటాయి. వీటిలోని ప్రతి ప్లాన్లోనూ జియో గేమ్స్ క్లౌడ్‌కి ఉచితంగా యాక్సెస్ ఇచ్చింది. గతంలో ఈ జియో గేమ్స్ క్లౌడ్‌కి ప్రో పాస్ అవసరం ఉండేది. దాని ధర రూ.398 ఉండేది. కానీ ఇప్పుడు ఈ కొత్త ప్లాన్లలో మీరు అదనంగా ఏమీ చెల్లించకుండా ఆ ప్రో పాస్ సదుపాయాన్ని ఉచితంగా పొందొచ్చు.

జియో గేమ్స్ క్లౌడ్ అనేది జియో అందిస్తున్న ఒక క్లౌడ్ గేమింగ్ సర్వీస్. దీని ద్వారా మీరు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ లేదా జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా హై క్వాలిటీ గేమ్స్‌ని ఆడవచ్చు. ఇందులో వందల కొద్దీ గేమ్స్ ఉండటం విశేషం. గేమింగ్ ప్రేమికుల కోసం ఇది నిజంగా అదిరిపోయే అవకాశం.

Related News

జియో ప్రారంభంగా ₹48 ప్లాన్ తీసుకొచ్చింది. ఇది కేవలం మూడు రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో 10MB డేటా ఉంటుంది. ఇది చిన్న ప్లాన్ అయినప్పటికీ గేమింగ్ క్లౌడ్ యాక్సెస్‌కి గేట్‌వే లా పనిచేస్తుంది.

ఈ ప్లాన్‌ను తీసుకుంటే మీరు ఏకంగా 7 రోజులపాటు జియో గేమ్స్ క్లౌడ్ యాక్సెస్‌ను ఉచితంగా పొందవచ్చు. 10MB డేటా కూడా ఇస్తున్నారు. వారం మొత్తం గేమింగ్‌ను ఎంజాయ్ చేయదలచినవారికి ఇది బాగా పనికొస్తుంది.

ఈ ప్లాన్‌కి 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. ఇందులో 3GB డేటా లభిస్తుంది. అలాగే మీరు ఈ 28 రోజులపాటు జియో గేమ్స్ క్లౌడ్ యాక్సెస్‌ను ఎంజాయ్ చేయవచ్చు. మిడ్ రేంజ్ బడ్జెట్ ఉన్నవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

రూ. 495 ప్లాన్ – డాటా, కాలింగ్, గేమింగ్ అన్నీ ఫ్రీగా

ఈ ప్లాన్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఎంతో లాభదాయకం. 28 రోజులపాటు రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. అదనంగా 5GB ఎక్స్‌ట్రా డేటా కూడా ఇస్తున్నారు. రోజు 100 ఎస్ఎంఎస్‌లు, అనలిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. గేమింగ్ ప్రేమికులకు జియో గేమ్స్ క్లౌడ్ ఉచితంగా ఉంటుంది. అంతేకాదు, జియో టీవీ, ఫాన్‌కోడ్, Jio AI క్లౌడ్ 50GB స్టోరేజ్, హాట్‌స్టార్ 90 రోజులు ఉచితం. ఇలా చూసుకుంటే డేటా, కాలింగ్, గేమింగ్, OTT అన్నీ కవరయ్యే ఫుల్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ ఇది.

రూ. 545 ప్లాన్ – ఓవర్ ఆల్ గేమింగ్ డీలైట్

ఈ ప్లాన్‌కి కూడా 28 రోజుల వాలిడిటీ ఉంది. ఇందులో మొత్తం 61GB డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అనలిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. అదనంగా 90 రోజులపాటు హాట్‌స్టార్, ఫాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ యాక్సెస్, 50GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. ప్రత్యేకంగా సెలెక్టెడ్ యూజర్లకు 5G డేటా కూడా అనలిమిటెడ్‌గా ఇవ్వబోతున్నారు. ఇది హైవాల్యూమ్ యూజర్లకు నిజంగా పెర్ఫెక్ట్ చాయిస్.

ఈ ప్లాన్‌లు ఎందుకు ప్రత్యేకం?

ఇప్పటి వరకు గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఈ రకమైన రీఛార్జ్ ప్లాన్లు ఎవరూ తీసుకురాలేదు. జియో ఇదే మొదటిసారి ఈ కొత్త సెగ్మెంట్‌కి అడుగు పెట్టింది. ప్రస్తుత గేమింగ్ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఈ ప్లాన్లు యువతను ఆకట్టుకుంటాయి. అదనంగా OTT, AI క్లౌడ్, 5G వంటి సదుపాయాలు ఉచితంగా లభించడం వల్ల వీటి వైపు కస్టమర్లు బాగా ఆకర్షితులవుతున్నారు.

మీరు ఏ ప్లాన్ ఎంచుకుంటారు?

మీ అవసరాన్ని బట్టి మీరు రూ.48 నుండి రూ.545 వరకు ఏదైనా ప్లాన్ ఎంచుకోవచ్చు. చిన్నగా ప్రారంభించాలనుకునేవారు మొదట రూ.98 ప్లాన్ ట్రై చేయవచ్చు. రెగ్యులర్ డేటా, కాలింగ్, OTT, గేమింగ్ అన్నింటినీ కావాలనుకునేవారు రూ.495 లేదా రూ.545 ప్లాన్ ఎంచుకుంటే బెస్ట్. అయితే జూన్ మధ్యలో వచ్చే సమ్మర్ సేల్‌కి ముందు ఈ ప్లాన్లు టాప్ ట్రెండింగ్ అవ్వడం ఖాయం. అందుకే లేట్ చేయకండి.

జియో మరోసారి టెలికాం రంగంలో గేమ్ చెంజర్ అని నిరూపించుకుంది. గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, డేటా అన్నీ ఒకే ప్లాన్‌లో ఉచితంగా ఇవ్వడం ద్వారా ఇది యూజర్లకు పండుగే. మీరు కూడా జియో సిమ్ వాడుతున్నారా? అయితే ఇక ఆలస్యం చేయకుండా మీకు సరిపోయే గేమింగ్ ప్లాన్‌కి షిఫ్ట్ అవ్వండి. ఇదే గోల్డెన్ ఛాన్స్…