
టాటా మోటార్స్ నుంచి భారతీయులందరూ ఎదురుచూస్తున్న మరో శక్తివంతమైన ఎలక్ట్రిక్ కారు త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. టాటా అవిన్యా 2025 పేరుతో ఈ కొత్త EV విడుదల కాబోతుంది. ఇది కేవలం ఓ కారు మాత్రమే కాదు, ఫ్యూచర్‌కు తగ్గ ఎలక్ట్రిక్ కారు. ఈ కారులో ఉన్న ఫీచర్లు, డిజైన్, బ్యాటరీ కెపాసిటీ అన్నీ అదిరిపోయేలా ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ కారును ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇప్పటి చార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండే సిటీల్లో ఇది ఎంత మక్కువ కలిగిస్తుందో ఊహించండి!
ఈ కారు ఫస్ట్ లుక్‌కి సంబంధించిన ఫోటోలు, ఫీచర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. చూస్తేనే పిచ్చెక్కించేలా ఉన్న ఈ కారులో ఉండబోయే స్పెసిఫికేషన్లు అన్ని కొత్తగా, ఆధునికంగా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా 12 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ఇంకా పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఆండ్రాయిడ్ ఆటో, మ్యూజిక్ సిస్టమ్ లాంటి అవసరమైన అన్ని ఫీచర్లు ఇందులో ఖచ్చితంగా ఉంటాయి.
అంతే కాదు, టాటా ఈ EVలో లగ్జరీ కార్లకు దీటుగా ఇంటీరియర్ డిజైన్‌ను తీర్చిదిద్దింది. డిజిటల్ స్పీడోమీటర్, టాచోమీటర్, నావిగేషన్ అసిస్టెంట్, అడ్వాన్స్డ్ లెవల్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. డ్రైవర్, ప్యాసింజర్ ఇద్దరికీ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. అదనంగా టర్న్ బై ఇండికేటర్, మొబైల్ కనెక్టివిటీ, అడ్జస్టబుల్ సీట్స్, బూట్ స్పేస్ ఇలా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. టెక్నాలజీతో పాటు, భద్రత పరంగానూ ఈ కారు విపరీతమైన ఆకర్షణీయత కలిగించనుంది.
[news_related_post]ఇంకా దీని బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే, ఇది నిజంగా సంచలనంగా ఉంది. పెద్ద కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో వాడుతున్నారట. ఫుల్ చార్జ్‌తో 500 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదంటే.. ఇది నమ్మశక్యంగా లేదనిపించవచ్చు. కానీ టాటా మోటార్స్ అందుకు పూర్తిగా సిద్ధమైంది. అంతే కాదు.. దీని టాప్ స్పీడ్ 180 కిలోమీటర్లకు పైగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఇది కేవలం సిటీ డ్రైవింగ్‌కే కాకుండా, హైవే ట్రిప్స్‌కు కూడా బెస్ట్ ఎంపిక అవుతుంది.
ధర విషయానికి వస్తే, ఈ కారు మిడ్ లగ్జరీ సిగ్మెంట్‌కు చెందినవిగా ఉంటుంది. అంటే దీని ప్రారంభ ధర సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్యగా ఉండబోతుందని సమాచారం. ఈ ధరకు అంతటి ఫీచర్లు, మైలేజ్, స్టైల్, సేఫ్టీ అన్నీ ఒకే కారులో రావడం అంటే ఇది నిజంగా బంపర్ ఆఫర్ లాంటిదే. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన వెంటనే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ఆడి లాంటి కార్లతో గట్టిపోటీ ఇవ్వనుంది.
ఈ EV ని ఎప్పుడెప్పుడు బుక్ చేసేద్దామా అని ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఇది గోల్డెన్ ఛాన్స్. ఎలక్ట్రిక్ కార్లకు మారే ట్రెండ్‌ను టాటా ఈ అవిన్యా ద్వారా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లబోతుంది. మీరు ఒక స్టైలిష్, లగ్జరీ EV కోసం ఎదురుచూస్తున్నారా? అయితే టాటా అవిన్యా 2025 తప్పక మీ డ్రీమ్ కారే అవుతుంది. దీన్ని మిస్ అయితే నష్టమే!