పెర్మనెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఐటీఐ అభ్యర్థులకు ఇది బంగారు అవకాశం. Heavy Vehicles Factory (HVF) తాజాగా 1850 జూనియర్ టెక్నీషియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 జూన్ 28వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 18, 2025.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే తప్పనిసరిగా అభ్యర్థుల దగ్గర NAC లేదా NTC సర్టిఫికేట్ ఉండాలి. ఆయా ట్రేడ్స్‌లో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. బ్లాక్‌స్మిత్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్, ఫిట్టర్, మిషినిస్ట్, వెల్డర్ వంటి వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు జరుగుతాయి.
జీతం విషయానికి వస్తే, ఎంపికైన అభ్యర్థులకు నెలకు కనీసం రూ.21,000 బేసిక్ పే ఇస్తారు. దీనికి తోడు ఇండస్ట్రియల్ డీఏ, స్పెషల్ అలవెన్స్ రూపంలో ఇంకొన్ని ప్రయోజనాలు అందిస్తారు. ప్రతి ఏడాది 3 శాతం ఇన్క్రిమెంట్ కూడా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఇది చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ప్రభుత్వ రంగంలో జీతం, భద్రత రెండూ కావాలనుకునే వారికి ఇది సూపర్ ఛాన్స్.
Related Posts
అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు, వికలాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఫీజు SBI Collect ద్వారా ఆన్‌లైన్ లో చెల్లించాలి. ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత దానిని స్కాన్ చేసి అప్లికేషన్‌కు అటాచ్ చేయాలి.
అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. మొదటిగా అధికారిక వెబ్‌సైట్ oftr.formflix.org లోకి వెళ్లాలి. కొత్తగా అప్లై చేసే వారు మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీతో రిజిస్టర్ కావాలి. అ తర్వాత లాగిన్ అయ్యి, విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు, ఇతర అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు ట్రేడ్ టెస్టులకు హాజరవలసి ఉంటుంది. ట్రేడ్ టెస్ట్‌కు హాజరయ్యేందుకు ప్రభుత్వం ఎటువంటి ట్రావెల్ అలవెన్స్ ఇవ్వదు. అందుకే అన్ని నిబంధనలు స్పష్టంగా చదివిన తర్వాతే అప్లై చేయాలి.
ప్రభుత్వ రంగంలో ఒక స్థిరమైన ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు కదా? అయితే ఇది మీ కోసమే. జూలై 18లోపే అప్లై చేయాలి. లేట్ చేస్తే ఈ సూపర్ ఛాన్స్ మిస్సవుతారు. అందుకే ఇప్పుడే అప్లై చేయండి!