
సోనీ నుండి ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఫ్లాగ్షిప్ మొబైల్ వచ్చేసింది. పేరు సోనీ Xperia 1 VII. 2025 మే 13న ఈ ఫోన్ అధికారికంగా ప్రకటించబడింది. ఈ ఫోన్ జూన్ మొదటి వారంలో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు భారత్‌లోనూ దీని హైప్ భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా కెమెరా, ఆడియో కోసం ఫోన్లు కొనుగోలు చేసే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ లాంటిది.
ఈ ఫోన్ ను ఒకసారి చేతిలో పట్టుకుంటే.. వాహ్! అనిపిస్తుంది. చాలా స్లిమ్ గా, క్లాసీగా కనిపిస్తుంది. 6.5 ఇంచుల OLED HDR డిస్ప్లేతో వస్తోంది. ఇది BRAVIA టీవీ టెక్నాలజీతో డిజైన్ చేయబడింది. అంటే సూపర్ క్వాలిటీ, ప్రీమియం వ్యూయింగ్ అనుభూతి. డిస్ప్లేలో “Creator Mode” కూడా ఉంది. అలాగే “Sunlight Vision” వల్ల బాగా వెలుతురులో కూడా క్లియర్‌గా స్క్రీన్ కనిపిస్తుంది. ఇది 197 గ్రాములే బరువు ఉంటుంది. మందం కేవలం 8.2mm మాత్రమే. చాలా లైట్ వెయిట్‌గా, హ్యాండ్ఫ్రెండ్లీగా ఉంటుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇది ఈ ఫోన్‌కి అసలైన హైలైట్. సోనీ తమ ఫేమస్ ZEISS లెన్స్‌లను ఇందులో ఇచ్చారు. మూడు కెమెరాలు ఉన్నాయి – వైడ్, అల్ట్రా వైడ్, టెలీఫోటో. అద్భుతమైన విషయం ఏంటంటే.. ఇది continuous optical zoom సపోర్ట్ చేస్తుంది. 85mm నుంచి 170mm వరకూ స్మూత్‌గా జూమ్ అవుతుంది. అంటే DSLR ఫీల్ ఫోన్ లోనే.
[news_related_post]అంతేకాదు, 4cm దూరం నుంచే మాక్రో షాట్స్ తీయొచ్చు. చాలా చిన్న వస్తువుల ఫొటోలు కూడా నిశితంగా వస్తాయి. అల్ట్రా వైడ్ కెమెరా ఇప్పుడు 48MPకి అప్‌గ్రేడ్ అయ్యింది. పూర్వపు మోడల్‌తో పోలిస్తే రెట్టింపు క్లారిటీ వస్తుంది. తక్కువ వెలుతురులోనూ బాగా ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఇందులో కొత్త AI Camerawork, Auto Framing కూడా ఉన్నాయి. అంటే ఆబ్జెక్ట్ కదిలినా వీడియో స్టేడీగానే ఉంటుంది.
సోనీ అంటే మ్యూజిక్. WALKMAN గుర్తుంది కదా? అదే సౌండ్ క్వాలిటీ ఇప్పుడు మళ్ళీ Xperia 1 VIIలో కనిపిస్తుంది. ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఇచ్చారు. LDAC, Hi-Res Audio, Dolby Atmos, స్టీరియో స్పీకర్లు – అన్నీ ఉన్నాయి. అంతేకాదు, ప్రత్యేకంగా డెడికేటెడ్ ఆడియో చిప్ కూడా ఉంది. వైర్ ఉన్నా లేకపోయినా – సౌండ్ క్వాలిటీ లో ఏమాత్రం రాజీ లేదు.
ఈ ఫోన్లో Snapdragon 8 Elite చిప్సెట్ ఉంది. ఇది 2025లో వస్తున్న టాప్ ఫోన్లలో వాడుతున్న కొత్త ప్రాసెసర్. 12GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. అదీ కాకుండా 2TB వరకు microSD కార్డ్ పెట్టొచ్చు – ఇది ఇప్పుడు చాలా ఫోన్లలో కనిపించదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh సామర్థ్యంతో వస్తుంది. 30W ఫాస్ట్ చార్జింగ్, 15W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కూడా ఉంది. అంటే డైలీ యూజ్‌కు ఇబ్బంది లేకుండా డే లాంగ్ బ్యాకప్ వస్తుంది.
ఇప్పుడు క్రేజీ విషయం – ఈ ఫోన్ ధర. ఇండియాలో 12GB + 256GB వేరియంట్ ధర ₹1,44,990 నుంచి ₹1,57,690 మధ్యగా ఉండే అవకాశం ఉంది. ఖరీదైనదే కానీ, ఇందులో ఉన్న ఫీచర్లను చూస్తే ఆ ఖర్చు విలువైనదే అనిపిస్తుంది. Samsung Galaxy S25 Ultra తో పోలిస్తే సోనీ ఫీచర్లు కొంచెం నిచ్గా అనిపించవచ్చు కానీ కెమెరా, ఆడియో విషయంలో మాత్రం ఇది దాదాపుగా unbeatable.
మీరు కెమెరా కంట్రోల్, ప్రీమియం ఆడియో, క్లీనింగ్ UI, మెమరీ కార్డ్ లవర్స్ అయితే – Xperia 1 VII మీరు మిస్ కాకూడదు. ఇదే ఫోన్‌కి వచ్చే ఏడాది మళ్లీ కొత్త వర్షన్ (Xperia 1 VIII) రావచ్చు కానీ ఇప్పటి ఫోన్ కే ప్రొఫెషనల్ టూల్స్ అన్నీ ఒకే మొబైల్లో కావాలంటే ఇది బెస్ట్ పిక్.