మీరు కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? మీ బడ్జెట్‌కు తగ్గ ఫీచర్లతో, సేఫ్టీకి ప్రాముఖ్యత ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ సమాచారం మీరు తప్పనిసరిగా చదవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చిందో కొత్త కారు టాటా, మారుతి, కియా, హ్యుందాయ్ లాంటి దిగ్గజాలకు చుక్కలు చూపిస్తోంది. చిన్న SUV సెగ్మెంట్‌లో ఇప్పుడు ఈ కొత్త ఆటగాడు పెద్ద దుమారం రేపుతున్నాడు. అదే స్కోడా కైలాక్ (Skoda Kylaq).
కొత్త కారు వచ్చినప్పటినుంచి మార్కెట్ లో హడావిడి
2024 నవంబర్‌లో స్కోడా కంపెనీ తమ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన స్కోడా కైలాక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే అసలు హడావిడి 2025 జనవరి చివరలో మొదలైంది. ఎందుకంటే అప్పుడే ఈ కారుకు డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత వరుసగా నెలలతొ అమ్మకాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. జనవరిలో ఈ కారు 1,245 యూనిట్లు అమ్ముడవ్వగా, ఫిబ్రవరిలో అది 3,636కి పెరిగింది. మార్చిలో ఈ సంఖ్య 5,327కి చేరగా, ఏప్రిల్‌లో మళ్ళీ మరింత పెరిగి 5,364కు చేరుకుంది.
ఈ సంఖ్యలు చూస్తేనే భారతీయుల మద్దతు ఎంతగా పెరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. స్కోడా కైలాక్‌కు ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణం దీని ఫీచర్లు, ధర, సేఫ్టీ రేటింగ్.
స్కోడా కైలాక్ అంటే ఏంటీ?
స్కోడా కైలాక్ అనేది సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV. అంటే దీని పొడవు 4 మీటర్ల లోపే ఉంటుంది. కానీ, ఇందులో ఇచ్చిన ఫీచర్లు మాత్రం హై ఎండ్ కార్లకు పోటీగా ఉంటాయి. అందుకే దీనిని తక్కువ బడ్జెట్‌తో హై క్వాలిటీ SUV కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా చూస్తున్నారు.
ఫీచర్లు చూశాక ఆశ్చర్యపోవాల్సిందే
ఈ కారులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అదికాకుండా 8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. మోడ్రన్ లుక్స్ కోసం సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్‌ను అందిస్తున్నారు. వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇవన్నీ చూసాక ఇది ఎంట్రీ లెవల్ కారు అనడానికి నమ్మలేం.
సేఫ్టీ విషయంలో అసలు కాంప్రమైజ్ లేదు
భారతదేశపు అత్యంత ముఖ్యమైన క్రాష్ టెస్ట్ అయిన భారత్ NCAPలో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. అంటే ఇది అత్యధిక భద్రత కలిగిన కారు అన్నమాట. అందులోనూ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్‌గా వస్తాయి. అలాగే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తున్నారు. అందుకే ఈ కారుకు కుటుంబాలు పెద్దగా ఆకర్షితమవుతున్నారు.
ఇంజిన్ పనితీరు ఎలా ఉంది?
ఈ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఇదే ఇంజిన్ స్కోడా కుషాక్, స్కోడా స్లావియా కార్లలో కూడా వాడుతున్నారు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దేనికైనా మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇంజిన్ పనితీరు చాలా స్మూత్‌గా ఉంటుంది. సిటీలో గానీ, హైవే మీద గానీ, ఎక్కడైనా ఈ కారు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
ధరలు చూస్తే మరింత ఆశ్చర్యం
బహుశా స్కోడా కైలాక్‌కు ఈ స్థాయి ఫేమ్ రావడానికి ప్రధాన కారణం దాని ధరలే కావచ్చు. ఎక్స్ షోరూమ్ ధరల ప్రకారం, స్కోడా కైలాక్ స్టార్టింగ్ వేరియంట్ రూ. 8.25 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షల వరకు ఉంటుంది. స్కోడా కంపెనీ నుంచి ఇప్పటివరకు వచ్చిన కార్లలో ఇదే చౌకైన SUV. స్కోడా బ్రాండ్‌కు సాధారణంగా ఉన్న ప్రీమియం ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ ధరలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పొచ్చు.
స్కోడా కైలాక్ ఎవరెవరికి పోటీగా వస్తోంది?
ఇప్పుడు మార్కెట్‌లో టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి కార్లు ఈ సెగ్మెంట్‌లో ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటికి స్కోడా కైలాక్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే స్కోడా కైలాక్ ధర తక్కువగా ఉండడంతో పాటు, ఫీచర్లు మాత్రం అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా, స్కోడా బ్రాండ్‌కు ఉన్న నమ్మకమూ ఇందులో జత కాబడింది.
ఒకప్పుడు స్కోడా అనే పేరు విన్న వెంటనే “చాలా ఖరీదు అయ్యే కారు” అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు స్కోడా బ్రాండ్ కూడా తమ కార్లను మిడిల్ క్లాస్‌కి అందుబాటులోకి తీసుకువస్తోంది. స్కోడా కైలాక్ ఈ మార్పుకు ప్రతీకగా మారింది. అందుకే మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని నెలలలోనే పెద్ద హిట్టుగా మారిపోయింది.
ఈ కారు మార్కెట్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి. కానీ ఇప్పటివరకు ఈ కారు చూపించిన ప్రదర్శన చూస్తే టాటా, మారుతి లాంటి బ్రాండ్లకు ఇది కచ్చితంగా పెద్ద పోటీ. స్కోడా బ్రాండ్‌కు ఉన్న నమ్మకంతో పాటు, కొత్త లుక్, అధిక సేఫ్టీ, బడ్జెట్ ధర – ఇవన్నీ కలిసొచ్చి ఈ కారును ఒక పెద్ద హిట్‌గా మార్చాయి.
మీరు కూడా మంచి SUV కోసం వెతుకుతుంటే, ఫ్యూచర్‌లో మీ కుటుంబాన్ని సేఫ్‌గా ప్రయాణించేటట్లు చూసుకోవాలంటే, స్కోడా కైలాక్‌ను ఒకసారి షోరూమ్‌కి వెళ్లి చూడండి. చవక ధరలో ఇలా 5-స్టార్ సేఫ్టీ వచ్చే SUV మార్కెట్‌లో అరుదు. ఇంకా ఆలస్యం ఎందుకు? కార్ మార్కెట్‌లో నూతన యుగానికి ఇది ఆరంభం కావచ్చు.