
ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలంటే తెలివిగా పెట్టుబడి పెట్టాలి. జీతం పెరగకపోయినా సంపద మాత్రం పెరగాలి అంటే మంచి స్కీమ్ ఎంచుకోవాలి. మన దగ్గర చాలా మంది లక్ష రూపాయలు బ్యాంకులో దాచేస్తారు. కానీ అదే డబ్బు సరైన మ్యూచువల్ ఫండ్‌లో పెడితే ఏకంగా 20 లక్షలు వచ్చేస్తాయని మీకు తెలుసా?
ఇది ఊహ కాదు. నిజంగా రెండు మ్యూచువల్ ఫండ్లు గత 20 ఏళ్లలో అద్భుతమైన రాబడులు ఇచ్చాయి. ఒకవేళ మీరు 2004లో ఆ ఫండ్లలో లక్ష పెట్టుంటే.. ఇప్పటికి అది 20 లక్షలకు పెరిగి ఉండేది. ఆ ఫండ్లు ఏంటంటే – ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ లార్జ్ క్యాప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ లార్జ్ క్యాప్ ఫండ్.
ఈ స్కీమ్స్ ప్రత్యేకత ఏమిటంటే ఇవి పెద్ద కంపెనీల్లోనే పెట్టుబడులు పెడతాయి. బలమైన బ్యాలెన్స్ షీట్, స్థిరమైన లాభాలు ఉన్న కంపెనీలు ఎలాంటి ఆర్థిక మాంద్యాల సమయంలోనైనా నిలబడతాయి. అందుకే ఇలాంటి ఫండ్లు ఎక్కువకాలం పెట్టుబడికి అత్యుత్తమం. ఇవి రిస్క్ తక్కువగా ఉండే స్కీమ్‌లు. అంతే కాదు, లాంగ్ టర్మ్‌లో హై రిటర్న్స్ ఇవ్వగల శక్తి ఉన్నవే.
[news_related_post]ఆదిత్య బిర్లా ఫండ్ 20 ఏళ్లలో 21 రెట్లు రాబడి ఇచ్చింది. అంటే ప్రతి ఏడాది సగటు 16.5 శాతం లాభం. హెచ్డీఎఫ్సీ ఫండ్ కూడా ఇదే రేంజ్లో రాబడి ఇచ్చింది. ఇది 20.1 రెట్లు పెరిగింది. వీటిలో పెట్టిన లక్ష రూపాయలు ఇప్పుడు 20 లక్షలుగా మారాయి. అదే మీరు బ్యాంక్‌లో FD చేసుంటే.. మిగిలేది కేవలం రెండింతలు మాత్రమే!
ఇంకా ముచ్చటైన విషయం ఏంటంటే.. ఈ స్కీమ్‌లు గత 10-15 ఏళ్లలోనూ స్టేడీగా మంచి లాభాలే ఇచ్చాయి. ఉదాహరణకు, ఆదిత్య బిర్లా ఫండ్ గత 10 ఏళ్లలో సుమారు 12.6 శాతం CAGR రేటుతో 3.3 రెట్లు రాబడి ఇచ్చింది. అలాగే 15 ఏళ్లలో 13.3 శాతం రేటుతో 6.5 రెట్లు పెరిగింది.
ఇలాంటి స్ట్రాంగ్ ఫండ్స్‌ను ఇప్పుడు కూడా ఎంచుకోవచ్చు. మీరు ఎక్కువ డబ్బుతో మొదలుపెట్టాల్సిన పనిలేదు. కేవలం లక్ష రూపాయలతోనే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌కు దారి సిద్ధం చేయొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇవాళే మొదలెట్టి.. రేపు మీరు కూడా 20 లక్షల క్లబ్లో చేరండి!