బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు టాలీవుడ్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటులపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది.
బెట్టింగ్ యాప్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఈ కేసును నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో 19 యాప్ యజమానులపై కేసులు నమోదు చేశారు. 19 మంది ఆపరేటర్లను నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రముఖులను సాక్షులుగా చేయాలని పోలీసులు యోచిస్తున్నారు.
బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన వారి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. బెట్టింగ్ మరియు ఆన్‌లైన్ గేమింగ్‌ను ప్రోత్సహించిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లను కూడా ఛార్జ్ షీట్‌లో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్రమ బెట్టింగ్‌కు ఆపరేటర్లే కారణమని పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు.
Related News
ఇప్పటికే అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66D కింద కూడా కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 8 మందిపై, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మందిపై కేసులు నమోదు చేశారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రీతూ చౌదరిలను ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ మహిళా నేత, టీవీ యాంకర్ శ్యామల ఈరోజు పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి.