
Kalki 2898AD Pre-Release Event Cancel : ప్రభాస్ నటించిన ‘Kalki’ సినిమా కోసం అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా June 27న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.ఇలాంటి తరుణంలో ప్రభాస్ అభిమానులకు భారీ షాక్ తగిలింది.
గత కొన్ని రోజులుగా చిత్ర బృందం కల్కి (Kalki 2898AD) ప్రమోషన్స్ చేస్తోంది. అయితే ఈ ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేవనే టాక్ వచ్చింది. రెండు రోజుల క్రితం ముంబైలో సింపుల్గా కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల కోసం నిర్మాతలు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేసినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.
[news_related_post]Like no pre-release event?
ప్రభాస్ ‘Kalki’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన Kalki ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. నిర్మాతలు ఇక్కడ ఎలాంటి ఈవెంట్ నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు (June 21) యూట్యూబ్‌లో రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదని సూటిగా చెప్పడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.