ప్రతి ఒక్కరి జీవితంలో బ్యాంకు అకౌంట్ ఉండటం తప్పనిసరి అయ్యింది. ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్ అనేది అత్యంత ప్రాధాన్యమైన ఆర్థిక సాధనంగా మారింది. ఎందుకంటే ఇది భద్రత, సులభతరం, అవసరానికి డబ్బు తీయడానికి అవకాశం, డిపాజిట్లపై పరిమితి లేకపోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది. దేశంలోని ప్రతి బ్యాంక్ కూడా ఈ సేవింగ్స్ అకౌంట్‌ను అందిస్తోంది.
ఇప్పటి వరకు మీరు కేవలం ఒకే రకం సేవింగ్స్ అకౌంట్ గురించి మాత్రమే విని ఉండవచ్చు. కానీ వాస్తవానికి ఇది అనేక రకాలుగా ఉంది. ఒక్కో రకానికి ఒక్కో ప్రయోజనం ఉంది. మీ అవసరాన్ని బట్టి, మీకు సరిపడే సేవింగ్స్ అకౌంట్‌ను ఎంచుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మనం ఏ రకాలు ఉన్నాయో, వాటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది తెలుసుకుందాం.
రెగ్యూలర్ సేవింగ్స్ అకౌంట్
ఇది సాధారణంగా ఎక్కువ మందికి తెలిసిన, తరచుగా ఉపయోగించే అకౌంట్. ఈ అకౌంట్ తీసుకోవడానికి మీరు కేవలం KYC చేయాల్సి ఉంటుంది. అందులో మీరు డిపాజిట్ చేసిన డబ్బుకు ఒక నిర్దిష్ట శాతం వడ్డీ వస్తుంది. అయితే కొంతమంది బ్యాంకులు కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయమని నిబంధనలు పెడతాయి. ఇది సాధారణ వినియోగదారులకు, రెగ్యులర్ ఖర్చులకు సరిపోయే సులభమైన అకౌంట్.
Related Posts
జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్
ఈ అకౌంట్ ప్రత్యేకంగా కనీస బ్యాలెన్స్ అవసరం లేని వాళ్ల కోసం. ఇందులో మీరు ఏ డిపాజిట్ లేకుండా కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ కొన్ని బ్యాంకులు ATM విత్‌డ్రా, చెక్‌బుక్, డెబిట్ కార్డులపై పరిమితులు పెడతాయి. ఇది విద్యార్థులకు, నెలనెలా ఆదాయం లేని వారికి చాలా సరైన ఎంపిక.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్
60 ఏళ్లు దాటి పింఛను జీవితం ప్రారంభించిన వారికి ఇది గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఇందులో సాధారణ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే తక్కువ వడ్డీ రేటుతో లోన్స్, ప్రత్యేక మేనేజర్ సేవలు లభిస్తాయి. మీ డబ్బును భద్రంగా పెట్టుకొని మంచి లాభాలు పొందాలనుకునే పెద్దవాళ్లకు ఇది బెస్ట్.
లేడీస్ సేవింగ్స్ అకౌంట్
ఈ అకౌంట్ ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించారు. ఇందులో మహిళలకు ప్రత్యేక డెబిట్ కార్డులు, లోన్, క్రెడిట్ కార్డులపై రాయితీలు, లాకర్లపై డిస్కౌంట్లు వంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మల్టిసిటీ చెక్‌బుక్, యాంటీ మినిమం బ్యాలెన్స్ వేవర్తో ఫ్రీడమ్‌గా ఫైనాన్షియల్‌గా ముందుకు సాగేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
చిల్డ్రన్ సేవింగ్స్ అకౌంట్
పిల్లలకు చిన్నప్పటి నుంచే సేవింగ్ అలవాటు చేయాలంటే ఈ అకౌంట్ బెస్ట్. పిల్లల పేరుతో గార్డియన్లు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పిల్లలకు ఫైనాన్షియల్ అవగాహన కలిగించడానికి ఇది మంచి స్టెప్.
ఇన్స్టంట్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్
మీరు ఇంట్లో కూర్చునే ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. e-KYC పూర్తిచేస్తే కొన్ని సెకన్లలో అకౌంట్ సిద్ధం. అయితే ఫుల్ KYC పూర్తికాలేకపోతే అకౌంట్‌ను బ్యాంక్ ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ ఎక్కువగా డిజిటల్ లావాదేవీల కోసం ఉంటుంది. ఎక్కువగా ₹1 లక్ష వరకు డిపాజిట్ పరిమితి ఉంటుంది.
సాలరీ సేవింగ్స్ అకౌంట్
ఇది ఉద్యోగాల్లో ఉన్నవాళ్ల కోసం. నెల నెలా జీతం ఈ అకౌంట్లోకే వస్తుంది. ఇందులో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఉచిత చెక్‌బుక్‌లు, ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు, జీరో బ్యాలెన్స్ ఫీచర్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్షూరెన్స్ వంటి ప్రత్యేక బెనిఫిట్స్ ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇది పెర్ఫెక్ట్ ఎంపిక.
ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్
ఇది కుటుంబ సభ్యులందరికీ కలిసి ఉపయోగించుకునేలా రూపొందించారు. ఒకే ఫ్యామిలీ IDతో చాలా మందికి అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. మీ తల్లి, తండ్రి, పిల్లలు, భార్యా భర్తలు, మామ, అత్త, నాన్నమ్మ, తాతయ్య, మనవలు ఇలా అందరినీ కలిపి ప్లాన్ చేయొచ్చు. దీని వల్ల ఒక్కటే అకౌంట్‌తో మొత్తం కుటుంబానికి ఆర్థిక నిర్వహణ సులభంగా ఉంటుంది.
ఈ రోజుల్లో సరైన సేవింగ్స్ అకౌంట్ ఎంచుకోవడం చాలా అవసరం. మీరు రెగ్యులర్ ఖర్చులకు, ఫ్యూచర్ సేవింగ్‌కి, పిల్లల భవిష్యత్తు కోసం, లేదా మీ కుటుంబ మొత్తం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోసం ఏదైనా అవసరమైతే అందుకు తగిన అకౌంట్ మనం ఎంచుకోవాలి. ఒకసారి ఎంపిక చేసిన తర్వాత అది మీ డబ్బును భద్రంగా ఉంచటమే కాకుండా, అవసరానికి మంచి రిటర్న్స్ ఇస్తుంది. అలాగే డిజిటల్ ఫెసిలిటీలు, లోన్ లాభాలు, ATM విత్‌డ్రా లిమిట్స్ వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని మీకు బెస్ట్ అకౌంట్‌ను సెలెక్ట్ చేయండి.
ఇప్పుడు మీరు ఏ రకం సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటున్నారు? ఆలస్యం వద్దు, మీకు సరిపోయే అకౌంట్‌ను ఈరోజే ఓపెన్ చేయండి…