Tata: టాటా నుంచి గుర్రం లాంటి కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిమీ పరుగే..

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల పట్ల క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ భారం అవుతుండడంతో చాలామంది ఇప్పుడు బ్యాటరీ కార్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయంలో టాటా కంపెనీ ఓ కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకురానుంది. దీని పేరే టాటా హారియర్ EV. ఇది ఇండియన్ మార్కెట్‌ను గడ్డకట్టించే స్థాయిలో ఉంటుందని అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే టాటా కంపెనీ హారియర్ అనే ఐసీ ఇంజిన్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు అదే కారును ఎలక్ట్రిక్ వర్షన్‌గా తీసుకురావడమే ప్రత్యేకత.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ కారును జూన్ 3న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ కోసం టాటా పెద్దగా ప్లాన్ చేసిందని తెలుస్తోంది. ఇది రాగానే మహీంద్రా కంపెనీకి గట్టి పోటీ తప్పదనిపిస్తోంది. ఇప్పటికీ మహీంద్రా BE6, Mahindra XEV 9e లాంటి మోడల్స్ మార్కెట్‌లో ఆకట్టుకుంటున్నా.. టాటా కొత్త మోడల్ వచ్చాక పోటీ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.

హారియర్ EV ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది సాధారణ ఎలక్ట్రిక్ కారు కాదు. దీని లోపల దాచిన టెక్నాలజీ చాలా modern గా ఉంటుంది. Level 2 ADAS అంటే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ దీనిలో ఉంటుంది. ఇది డ్రైవింగ్ చేసే సమయంలో భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. అలాగే కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా మీరు ఫోన్‌ నుంచే కారును ట్రాక్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు.

Related News

ఇంకా ఇందులో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. అంటే డ్రైవర్, కో డ్రైవర్ వ్యక్తిగతంగా ఎయిర్ కండీషనింగ్‌ను సెట్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ కంఫర్ట్ కోసం పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఇందులో ఉంది. పైగా 12.3 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. దీంతోపాటు 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది కారులో అవసరమైన సమాచారం మొత్తం డిజిటల్‌గా చూపిస్తుంది.

సౌండ్ lovers కోసం JBL ఆడియో సిస్టమ్ అందించనున్నారు. అంటే ప్రయాణం చేసేటప్పుడు సంగీతం ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. టెర్రైన్ మోడ్‌లు, AWD అంటే All Wheel Drive టెక్నాలజీ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. అంటే అడ్డదారులు అయినా, గుట్టల దారులైనా.. ఈ కారు చాలా ఈజీగా సాగిపోతుంది.

ఇక టాటా హారియర్ EVలో 75 kWh బ్యాటరీ ఉండే అవకాశముంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లొచ్చు. మళ్లీ మధ్యలో ఛార్జింగ్ అవసరం లేదు. ఇది middle class ఫ్యామిలీలకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీని టాప్ స్పీడ్ కూడా మంచి స్థాయిలో ఉంటుంది. జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగం వరకు కేవలం 6 సెకన్లలోపే చేరే సామర్థ్యం దీనికి ఉండొచ్చని టాటా చెబుతోంది.

ఇంకా ఈ కారు Gen 2 Acti.EV ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతోంది. ఇది టాటా కొత్తగా రూపొందించిన ఫ్రేమ్. దీనివల్ల కారు బరువు తక్కువగా ఉండి, మైలేజ్ ఎక్కువగా వస్తుంది. ఫ్యూచర్‌లో వచ్చే టాటా EVలన్నీ ఇదే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే అవకాశముంది.

ధర విషయానికి వస్తే.. ప్రారంభ వేరియంట్ ధర సుమారు రూ. 22 లక్షల నుంచి మొదలవుతుందని అంచనా. టాప్ వేరియంట్ ధర మాత్రం రూ. 30 లక్షల వరకు ఉండొచ్చు. ఇవి అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ కలిపితే ధర మరింత పెరుగుతుంది. కానీ ఇచ్చే ఫీచర్లు చూసుకుంటే ఈ ధర న్యాయంగా అనిపిస్తోంది.

ఇప్పుడు ఈ కారు మార్కెట్‌లోకి వస్తే, ఇది మహీంద్రా BE6, Mahindra XEV 9e కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. మహీంద్రా ఇప్పటికే మంచి సేల్స్ సాధిస్తోంది. కానీ టాటా బ్రాండ్‌పై ఫ్యామిలీలకు ఉన్న నమ్మకాన్ని చూస్తే.. హారియర్ EV కూడా మార్కెట్‌ను బాగా ఆకట్టుకోవడం ఖాయం. టాటా కంపెనీకి భారతీయుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికి తోడు EV లాంటి futuristic టెక్నాలజీ ఇచ్చే కారును తీసుకురావడం వారు తీసుకున్న bold decision.

అంతే కాదు.. టాటా కార్లకు మైలేజ్, భద్రత, మరియు బిల్డ్ క్వాలిటీ విషయంలో మంచి పేరుంది. ఇది కూడా హారియర్ EVకు కలిసొచ్చే అంశమే. మీరు పటిష్టమైన, స్టైలిష్, మరియు modern టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ కారు కోసం వెతుకుతుంటే.. హారియర్ EV ఓ బెటర్ ఎంపిక కావొచ్చు.

మొత్తం మీద ఈ కొత్త టాటా హారియర్ EV మార్కెట్‌ను షేక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు కొత్తగా కారు కొనాలనుకుంటే, కొన్ని రోజులపాటు వెయిట్ చేయడం బెటర్. జూన్ 3న లాంచ్ అయిన తర్వాత ధర, స్పెసిఫికేషన్లకు క్లారిటీ వస్తుంది. అప్పుడే మంచి డిసిషన్ తీసుకోవచ్చు. ఇప్పట్లో బుక్ చేసుకుంటే ముందే డెలివరీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. టాటా తీసుకురానున్న ఈ కొత్త కారు నిజంగా ఆటను మార్చేయడానికే వస్తోందని చెప్పవచ్చు.