చలికాలం రాగానే అనేక వ్యాధులు వేధిస్తాయి. అధిక చలి కారణంగా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడము. చలి ఆర్యోగని ఎంతో ప్రభావితం చేస్తుంది.
ఇకపోతే, చలికాలం లో BP పెరగడం అనేది ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా.. BP 130/85 కంటే ఎక్కువగా ఉంటుంది. అధిక చలి కారణంగా బయటకు వెళ్లడం మానేస్తాము, రోజంతా దుప్పట్లలో అలానే పాడుకుంటాము. దీని కారణంగా, చల్లని వాతావరణంలో రక్త సిరలు కుంచించుకుపోతాయి. దీంతో BP అదుపు లో లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలు అనుసరిస్తే BP ని నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
1. శరీరాన్ని వెచ్చగా ఉంచాలి
Related News
అధిక చలి కారణంగా మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మనం ఎల్లప్పుడూ వెచ్చని దుస్తులలో వేసుకోవాలి. ఒకవేళ అవసరం అయితే కాళ్లకు సాక్స్ వేసుకోవడం మంచిది. ముఖ్యంగా అరచేతులను రుద్దడం ద్వారా వెచ్చదనాన్నిపొందొచ్చు.
2. సరైన ఆహారం తీసుకోవాలి
కొన్నిఆహారాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఆహారంలో వెల్లుల్లి, అల్లం, పసుపు, టమోటాలు ఉండేటట్లు చూసుకోవాలి. బీట్‌రూట్, క్యారెట్ సూప్ వారానికి 2-3 సార్లు త్రాగాలి. దీంతో BP కాస్త అదుపులో ఉంటుంది. అంతేకాకుండా.. ఉదయాన్నే కొత్తిమీర గింజలు మరిగించిన నీటిని తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది.
3. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి
చలికాలంలో వేడివేడిగా, రుచికరమైన ఆహారాలు తినాలనిపిస్తుంది.అయితే ఉప్పు కలిగిన పాపడ్, ఊరగాయలు, ఉప్పగా ఉండే డ్రై ఫ్రూట్స్ లేదా ఇతర చిరుతిళ్లను పూర్తిగా తినకూడదు. దీంతో BP కంట్రోల్ లో ఉంటుంది. వీటి స్థానాల్లో వేరే ఆహారాలను చేర్చుకోవాలి.
4. పండ్లను తీసుకోండి
పండ్లు ఆర్యోగనికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి అనేక వ్యాధులను తరిమికొడుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఈ క్రమంలో రోజూ ఒక అరటిపండు లేదా సిట్రస్ పండ్లను తీసుకోవాలి. దీంతో BP అదుపులో ఉంటుంది.
5. డీప్ బ్రీతింగ్ వ్యాయామం
ప్రతిరోజు కనీసం 2-3 సార్లు లోతైన శ్వాసను లోపలికి, వదలడానికి ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల కూడా BP కంట్రోల్ గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు డీప్ బ్రీతింగ్ వ్యాయామం చేయడం వల్ల శ్వాసకోస వ్యాధులు రాకుండా ఉంటాయి.
6. తగినంత నిద్ర
ప్రతిఒక్కరికి నిద్ర అవసరం. ఇక అధిక BP ఉన్నవారు అయితే దాదాపు 7-8 గంటల నిద్ర పోవాలి. ఎక్కువ లేదా తక్కువ నిద్ర వల్ల రక్తపోటు ప్రభావితమవుతుంది. సరిపోయినంత నిద్ర పోతే శరీరం కూడా అలసిపోదు.
7. BPని పర్యవేక్షించండి
అధిక BP ఉన్నవారు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, అవసరం ఉన్నపుడు కూడా BP ని తరచుగా చెక్ చేసుకోవాలి. అయితే నిద్ర, వ్యాయామం, భోజనం లేదా స్నానం చేసిన వెంటనే బిపిని తనిఖీ చేయకూడదని గుర్తుంచుకోండి.
పైన పేర్కొన చర్యలు తీసుకున్నప్పటికీ బిపి అదుపులో లేకుంటే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. ఈ విధంగా మీరు శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని పూర్తిగా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు.