
డీఆర్డీఓ హైదరాబాద్‌లో ఉద్యోగాలు: ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం!
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూలై 26, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
[news_related_post]పోస్టు పేరు ఖాళీల సంఖ్య
- ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్ 01
- ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్ (పీఎస్ఏఏ) 01
- ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ 01
మొత్తం ఖాళీల సంఖ్య 03
అర్హత ప్రమాణాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ/బీఎస్సీ/బీసీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్‌కు 50 ఏళ్లు మించకూడదు.
సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్‌కు 45 ఏళ్లు మించకూడదు.
ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు మించకూడదు.
జీతం (నెలకు):
- ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్‌కు: రూ.59,276
- సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్‌కు: రూ.47,496
- ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్‌కు: రూ.35,220
ముఖ్యమైన తేదీలు & ఇతర వివరాలు:
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జూలై 3.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూలై 26.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు: రూ.100.
ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.