BEL రిక్రూట్‌మెంట్ 2024: ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హోంల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ SBU (HLS మరియు SCB SBU) ప్రాజెక్ట్ కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసేందుకు 78 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Related News
మొత్తం 78 పోస్టులలో,
- 06 సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ పోస్టులు ,
- 41 ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్,
- 13 ప్రాజెక్ట్ ఇంజనీర్, మరియు
- 18 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి
ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్ పేర్కొంది.
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 24. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం https://bel-india.in/ వెబ్‌సైట్‌ను చూడండి.
దరఖాస్తు ఫీజు విషయానికొస్తే.. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.400+జీఎస్టీ, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.150+జీఎస్టీ, ఇతర పోస్టులకు రూ.450+జీఎస్టీ. SC/ST/PWBD అభ్యర్థులకు ఈ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.
ఎట్టకేలకు ఎంపికైన వారిలో..
సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.80 వేలు వేతనం లభిస్తుంది. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ పోస్టులకు రూ.60 వేలు, అదే విధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.40 వేలు, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.30 వేలు వేతనం లభిస్తుంది.