గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలను స్వావలంబనతో మరియు ఆర్థికంగా స్థిరంగా ఉండేలా చేయడానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 9 న హర్యానాలోని పానిపట్‌లో ‘LIC Bhima Sakhi Yojana’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా, మొదటి బ్యాచ్ గా లక్ష మంది మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు.
ఈ పథకం కింద, 10వ తరగతి పూర్తి చేసిన మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)లో మూడేళ్లపాటు భీమా సఖీలుగా శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో, మహిళల బ్యాంకు ఖాతాలలో నెలవారీ స్టైఫండ్ కూడా జమ చేయబడుతుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.
ఎల్‌ఐసీ భీమా సఖి ఏజెంట్‌లుగా ఎంపికైన వారు తమ ఇళ్ల నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలను విక్రయించడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే స్టైఫండ్‌కు అదనంగా కమీషన్ పొందవచ్చు. ఇంట్లో ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఇది చాలా మంచి అవకాశం.
Related News
మూడేళ్ల శిక్షణ పూర్తయిన తర్వాత, 10వ తరగతి పూర్తి చేసిన వారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా ఏజెంట్లుగా కొనసాగవచ్చు. అంతేకాకుండా డిగ్రీలు పూర్తి చేసిన మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా ఉద్యోగావకాశాలు కూడా కల్పించనున్నారు.
LIC బీమా సఖి యోజన రిక్రూట్‌మెంట్ ముఖ్యమైన వివరాలు:
భర్తీ చేయనున్న పోస్టులు: బీమా సఖీ ఏజెంట్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: ఇందుకోసం మహిళలు 10వ తరగతి మాత్రమే ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు అర్హులు.
జీతం:
- రూ. 7000/- మొదటి సంవత్సరం మహిళల బ్యాంకు ఖాతాలలో ప్రతి నెల జమ చేయబడుతుంది.
- రూ. 6000/- మహిళల బ్యాంకు ఖాతాలలో రెండవ సంవత్సరం ప్రతి నెల జమ చేయబడుతుంది.
- రూ. 5000/- మహిళల బ్యాంకు ఖాతాలలో మూడవ సంవత్సరం ప్రతి నెల జమ చేయబడుతుంది.
- దీంతో పాటు వారు చేసిన పాలసీలకు కమీషన్ కూడా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వబడింది.
శిక్షణ కాలం: ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసి ఎంపికైన వారికి మూడేళ్లపాటు శిక్షణ కూడా ఇస్తారు.
శిక్షణ పూర్తయిన తర్వాత 10వ తరగతి చదివిన వారికి ఎల్‌ఐసీలో బీమా ఏజెంట్లుగా, డిగ్రీ పూర్తి చేసిన వారికి డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.
ఎవరు అనర్హులు: ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఏజెంట్లుగా పనిచేస్తున్న వారు మరియు వారి కుటుంబ సభ్యులు బీమా సఖీ ఏజెంట్లుగా పనిచేయడానికి అనర్హులు.
Online apply link: Click here