ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్ ప్రముఖ టెక్ కంపెనీలతో కీలక ఒప్పందంపై సంతకం చేసింది. టెక్ తయారీ కంపెనీలు AMD, నోకియా, సిస్కోలతో కలిసి జియో ప్లాట్‌ఫామ్స్ కొత్త AI ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ ఖర్చులను తగ్గించడానికి, నెట్‌వర్క్ భద్రత, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి టెలికాం AI ప్లాట్‌ఫామ్‌ను రూపొందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. నెట్‌వర్క్ కార్యకలాపాల అన్ని స్థాయిలు మరియు విభాగాలలో AI, ఆటోమేషన్‌కు మద్దతు ఉంటుందని కంపెనీలు తమ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. AI ప్లాట్‌ఫామ్ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని, డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో ఇతర అవకాశాలను ప్రారంభిస్తుందని జియో ప్లాట్‌ఫామ్స్ CEO మాథ్యూ ఊమన్ అన్నారు. కొత్త AI ప్లాట్‌ఫామ్ పెద్ద భాషా నమూనా (AI సెర్చ్ ఇంజిన్) ద్వారా నెట్‌వర్క్ సామర్థ్యాలను ఆప్టిమైజ్ చేయడానికి ఓపెన్ అప్లికేషన్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగిస్తుందని ఆయన అన్నారు.
Jio: టెలికాం ఏఐ ప్లాట్‌ఫామ్ కోసం ఏఎండీ, సిస్కో, నోకియాతో జియో ఒప్పందం..

05
Mar