ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోకు 46 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. జియో కస్టమర్ల కోసం రిలయన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతి నెలా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఏడాది పాటు అద్భుతమైన సేవలను అందించే రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు అపరిమిత కాలింగ్, డేటా, OTT సబ్స్క్రిప్షన్లను అందిస్తాయి. ఆ ప్లాన్ల వివరాలను తెలుసుకుందాం.
జియో ప్లాన్ ధర రూ. రూ. 3599తో రీఛార్జ్ చేస్తే.. 365 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 2.5GB డేటాను పొందవచ్చు. రోజువారీ డేటా పరిమితి తర్వాత, వేగం 64kbpsకి పడిపోతుంది. దీనిలో మీరు జియో ట్రూ 5G సేవలను కూడా పొందవచ్చు. అలాగే, జియో సినిమా ప్రీమియం 90 రోజులకు, క్లౌడ్ స్టోరేజ్ 365 రోజులకు సేవను అందిస్తుంది.
అలాగే, మీరు రూ. 3,999.. మీరు 365 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్, రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా, 100SMS, Jio Hotstar మొబైల్/TV 90 రోజుల సబ్స్క్రిప్షన్, ఉచిత 50GB క్లౌడ్ స్టోరేజ్ (Jio AI క్లౌడ్) ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ డేటాను ఉపయోగించే వారికి ఇవి ఉత్తమ ప్లాన్లు అని చెప్పవచ్చు.