సిడ్నీ టెస్టులో భారత కెప్టెన్ బుమ్రా (జస్ప్రీత్ బుమ్రా) గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో రోజు ఆటకు దూరంగా ఉన్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ నుంచి తన ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.
బుమ్రా స్కానింగ్ కోసం వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఈరోజు లంచ్ విరామం తర్వాత ఒక ఓవర్ వేసిన బుమ్రా మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టలేదు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు బుమ్రా 10 ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
అతను బహుశా స్కాన్ కోసం వెళ్తున్నట్లు భారత వ్యాఖ్యాత రవిశాస్త్రి తెలిపారు. బుమ్రా ఆరోగ్యం బాగోలేదని కూడా వార్తలు వచ్చాయి. నేటి మ్యాచ్‌లో మళ్లీ బౌలింగ్ చేస్తానన్న నమ్మకం లేదని అన్నాడు. ట్రైనింగ్ కిట్ డ్రెస్ లో హాస్పిటల్ కి వెళ్ళాడు.
Related News
మరోవైపు ఆస్ట్రేలియా తాజా సమాచారం ప్రకారం తన తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.