JAMILI ELECTIONS : జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. లోక్‌సభలో నోటీసు

కాంగ్రెస్: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ నోటీసు ఇచ్చారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాజ్యాంగం (129) సవరణ బిల్లు 2024ని విధివిధానాల్లోని రూల్ 72 కింద ప్రవేశపెట్టరాదని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపాదిత బిల్లుపై తన అభ్యంతరాలతో పాటు రాజ్యాంగబద్ధతను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తోందని లోక్‌సభలో ఇచ్చిన నోటీసులో ఆయన వెల్లడించారు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశం యొక్క సమాఖ్య స్వభావాన్ని ధృవీకరిస్తుంది మరియు రాష్ట్రాలు యూనియన్‌గా ఉండాలని నిర్ధారిస్తుంది అని మనీష్ తివారీ పేర్కొన్నారు.

అయితే ఈ రాజ్యాంగ (129) సవరణ బిల్లు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను ప్రతిపాదిస్తున్నదని ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. ఈ ఉమ్మడి ఎన్నికల ద్వారా రాష్ట్రాలు స్వయంప్రతిపత్తిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే, రాజ్యాంగంలో పొందుపరిచిన ఫెడరలిజం ప్రజాస్వామ్య సూత్రాలను ప్రాథమికంగా నిర్వీర్యం చేస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మరింత ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు.

Related News