ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే కోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రెగ్యులరైజేషన్ చేయాలని పట్టుపడితే సమస్య పెరుగుతుందే తప్ప పరిష్కారం కావడం లేదన్నారు. ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే ఉద్యోగుల సహకారం అవసరమన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను గతంలోనే ఆదేశించారు. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్ భూసేకరణ ప్రక్రియను సంక్రాంతి నాటికి పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు సంబంధించి అటవీశాఖ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండేలా డిజైన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు.