స్టేట్ బ్యాంకును ట్రజరీ బ్యాంకు అని కూడా అంటారు. ప్రభుత్వ ఆర్ధిక కార్యాకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్టుం టుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచు కునే సదుపాయం ఉంటుంది. అయితే, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకుని ఆ బ్యాంకుద్వారా జీతాలు పొందుతున్నట్టయితే అనేక ప్రయోజ నాలు ఉచితంగా లభిస్తాయి.
ఈ విషయం చాలమందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఉదాహరణకు, వివిధ రుణాలు అంటే గృహరుణం, వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకు లో ఎక్కౌంటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రోసెసింగ్ చార్జిలో 50శాతం మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్టులు, చెక్కులు, ఎస్.ఎం.ఎస్, హెచ్చరికలు అన్నీ ఉచితంగా లభిస్తాయి. అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా పొందవచ్చు.
అన్నిటి కంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు స్కీము కింద రు.20 లక్షలు, ఎయిర్ డెంట్ ఇన్సూరెన్సు కింద అయితే, రు.30 లక్షలు చెల్లించబడతాయి. దానికి తోడు ఎస్.బి.ఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హెూల్డర్లకు మరో పది లక్షలు చెల్లిస్తారు. అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్సు ఉచితంగా కవరపు తుంది. దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచికి వెళ్లి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి. ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పధకం వర్తిస్తుంది.
దీనికి నాలుగు రకాల స్లాబులు ఉంటాయి.
- జీతం 10 వేల నుండి 25 వేల మద్య సిల్వర్ గాను,
- 25 వేల నుండి 50 వేల మద్య జీతం ఉంటే గోల్డిగాను,
- 50 నుండి లక్ష వరకు జీతం పొందుతుంటే డైమండ్ గాను,
- లక్ష పైబడి పొందితే ప్లాటినంగాను నిర్ణయిస్తారు.
స్లాబు ను బట్టి ఇన్సూరెన్సు కవరేజ్ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు. కాగా, ఈ పథకం గురించి విద్యాధికులయిన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. వీడియోల ద్వారా ప్రతీ ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు. నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పధకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయో జనం పొందలేకపోతోందట.
అందుకే ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబసభ్యులకు చెప్పి, తన మరణానంతరం కుటుంబం ప్రయోజనం పొందే లా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సందేశంలోకోరారు.