మన దగ్గర అన్ని కాలాల్లో సొరకాయ దొరుకుంతుంది. సొరకాయను అనపకాయ అని కూడా అంటారు. సొరకాయను చాలా మంది ఛీప్గా చూస్తారు. కానీ సొరకాయ తింటే వచ్చే లాభాలు తెలిస్తే…మీరు వదిలిపెట్టరు.
సొరకాయలో విటమిన్లు, ప్రోటీన్లు చాలా ఉంటాయి. పైబర్, పోటాషియం, మినరల్స్ , ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
తరచు సొరకాయను తినడం వల్ల రక్తపోటు తగ్గుతుందట. బీపీ ఉన్నవారు వారంలో ఒక్కసారైన తినాలని వైద్య నిపుణులు అంటున్నారు. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బరువు సమస్యతో బాధపడే వారు తింటే…సన్నబడుతారు.
Related News
సొరకాయలో కాలరీలు, పీచుపదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ ఉన్నావారికి ఎంతో మేలు చేస్తుంది. సొరకాయలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్‌లాంటి పోషకాలు ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగడతాయి. గుండె ఆరోగ్యానికి ఇది ఉత్తమమైన ఆహారంగా పని చేస్తుంది.
సొరకాయలో మంచి పోషకాలు మెండు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి…అధిక రక్తపోటును తగ్గించి…గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బీజీ లైఫ్‌లో చాలా మంది టెన్షన్ పడుతుంటారు. సొరకాయ తింటే ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది.
అధిక స్ట్రెస్ వల్ల చాలా మంది వ్యాధుల బారిన పడుతున్నారు. స్ట్రెస్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. సొరకాయను…కూర రూపంలోనే కాదు…జ్యూస్ చేసుకుని ఉదయాన్నే తాగితే…ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.