నేటి సమాజంలో చాలా మంది లక్షాధికారులు కావాలని కోరుకుంటారు. ఇందుకోసం చాలా మంది వివిధ పథకాల్లో (ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్) పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి తక్కువ సమయంలో కోటీశ్వరుడు కావాలని చూస్తున్నారా? అయితే దాని కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎన్ని సంవత్సరాలు వేచి ఉండాలో అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. మీరు ప్రస్తుతం జనాదరణ పొందిన మ్యూచువల్ ఫండ్ SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) పద్ధతిని ఎంచుకుంటే, మీరు దీని ద్వారా కావలసిన మొత్తాన్ని సులభంగా పొందవచ్చు.
ఒకేసారి పెట్టుబడితో..
Related News
ఈ నేపథ్యంలో మీరు సిప్ విధానంలో ఒకేసారి 13 లక్షల రూపాయలను పెట్టుబడి చేసి మర్చిపోండి. ఆ తర్వాత మీరు 15 సంవత్సరాల తరువాత కోటి రూపాయలను అందుకుంటారు. వార్షిక రాబడి 15 శాతం వడ్డీ ప్రకారం మీకు రూ. 1,05,78,180 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో మీరు 13 లక్షలు పెట్టుబడి చేయగా, మీకు వడ్డీ రూపంలోనే రూ. 92,78,180 లక్షలు లభిస్తాయి. రిటైర్ అయిన ఎవరైనా వారి పిల్లలకు ఇచ్చిన మొత్తాన్ని ఇలా ఉపయోగించుకుంటే మంచి రాబడులు వస్తాయని చెప్పవచ్చు. లేదా ఇంకేదైనా ఆస్తి అమ్మకం లేదా ఇతర వ్యాపారాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఈ విధానంలో సేవ్ చేస్తే మీకు భారీ మొత్తం లభించే ఛాన్స్ ఉంది
తక్కువ పెట్టుబడితో కూడా..
అయితే మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి చేసే పరిస్థితి లేకున్నా కూడా ఇబ్బంది లేదు. ప్రతి నెలలో కూడా కొంత మొత్తాన్ని పెట్టుబడి చేయడం ద్వారా కూడా ఈ మొత్తాన్ని పొందవచ్చు. కానీ దీని కోసం ప్రతి నెలలో కూడా తప్పనిసరిగా చెల్లింపులు చేసుకోవాలి. ఈ కోటీ రూపాయల మొత్తం కావాలంటే మీరు ప్రతి నెలలో రూ. 5 వేలు పెట్టుబడి చేయాలి. ఈ విధంగా 22 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది.
15 శాతం వార్షిక రాబడి ప్రకారం చూస్తే మీకు 22 ఏళ్ల తర్వాత రూ. 1,03,53,295 లభిస్తాయి. ఈ నేపథ్యంలో మీరు పెట్టుబడి చేసే మొత్తం రూ. 13,20,000 కాగా, మీకు వడ్డీ రూపంలోనే రూ. 90,33,295 లక్షలు వస్తాయి. ఈ లక్ష్యాలను మీరు చేరుకోవాలంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైం అవసరం అవుతుంది.
గమనిక: మీకు పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉంటే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.