
ఇప్పుడు మనలో చాలా మంది ఆర్థిక భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును బాగా ప్లాన్ చేస్తున్నారు. పిల్లలు ఉన్నతంగా చదవాలి, వాళ్లకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ముందుగానే పొదుపు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్లలో డబ్బు పెట్టారు, మరికొంతమంది పోస్టాఫీస్ స్కీమ్స్‌లో డబ్బు పెట్టుకుంటున్నారు. అందులో కూడా మంచి వడ్డీ వచ్చే పథకాలను ఎంచుకుంటున్నారు.
ఇప్పుడు మీకు ఒక్క గొప్ప స్కీమ్ గురించి చెప్పబోతున్నాం. ఇది పిల్లల భవిష్యత్తును సురక్షితంగా మార్చే ఒక రూట్. పేరు బాల జీవన్ భీమా యోజన. ఇది పోస్టాఫీస్‌లో లభిస్తుంది. దీన్ని మీరు మీ పిల్లల పేరుతో తెరవాలి. ఈ స్కీమ్‌లో ప్రత్యేకత ఏంటంటే – రోజుకి కేవలం ₹6 నుంచి ₹18 వరకు మాత్రమే పొదుపు చేస్తే చాలు. దీని వల్ల మీరు మెచ్యూరిటీ సమయంలో లక్షలు పొందగలుగుతారు.
ఉదాహరణకి, ఒక తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలకూ ఈ స్కీమ్ తీసుకుంటే.. రోజుకి రూ.36 (ఒక్కొక్కరికి రూ.18) పొదుపు చేస్తే చాలంతే. నెలకు ఇది రూ.1080 అవుతుంది. సంవత్సరం తర్వాత మీరు రూ.12,960 పొదుపు చేసినట్లవుతుంది. ఈ స్మార్ట్ సేవింగ్స్ మీరు 15 ఏళ్లపాటు చేస్తే మొత్తం రూ.1,94,400 మాత్రమే పొదుపు చేసినట్లవుతుంది. కానీ.. మెచ్యూరిటీ టైంలో మీరు దాదాపు రూ.6 లక్షలు (ఒక్కొక్కరికి రూ.3 లక్షలు) పొందవచ్చు. ఇది చిన్న పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందే గొప్ప అవకాశం.
[news_related_post]ఈ స్కీమ్‌లో చేరాలంటే పిల్లల వయసు 5 నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉండాలి. తల్లిదండ్రుల వయసు 45 ఏళ్లలోపు ఉండాలి. ఒక కుటుంబానికి కేవలం ఇద్దరు పిల్లలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇది చాలా స్పెషల్ ప్లాన్. ఇప్పుడు మీరు మొదలుపెట్టకపోతే.. తర్వాత ఈ లాభం కోల్పోతారు. అందుకే ఆలస్యం చేయకుండా మీరు మీ దగ్గరనున్న పోస్టాఫీస్‌కు వెళ్లండి. అక్కడ ఉన్న అధికారులను కలిసి పూర్తి వివరాలు తెలుసుకోండి. అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి.
ఇది పిల్లల భవిష్యత్తుకి మంచి పెట్టుబడి మాత్రమే కాదు.. తల్లిదండ్రులకూ మానసిక ఆరామం ఇస్తుంది. చిన్న మొత్తాలతో ప్రారంభమయ్యే ఈ స్కీమ్, మీ పిల్లలకు భవిష్యత్తులో భారీగా లాభం ఇస్తుంది. ఇప్పటికైనా మీరు మొదలుపెట్టకపోతే, తర్వాత మీరు ఈ అవకాశాన్ని కోల్పోతారేమో!