PPF ఖాతా 15 ఏళ్ల తర్వాత మేచ్యూర్ అవుతుంది
PPF ఖాతా సాధారణంగా 15 సంవత్సరాల తరువాత మేచ్యూర్ అవుతుంది. అయితే, మీరు మరో 5 సంవత్సరాలకు పొడిగించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫారం సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు, అంటే PPF ఖాతా గరిష్టంగా 50 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు. ఈ ఖాతాను మీరు ఏదైనా బ్యాంక్‌లో లేదా దగ్గరలో ఉన్న పోస్టాఫీస్‌లో తెరవవచ్చు.
₹50,000 పెట్టుబడి పెడితే 25 ఏళ్లలో
మీరు PPF ఖాతాలో ఏటా ₹50,000 జమ చేస్తే 25 ఏళ్ల తర్వాత మొత్తం ₹34,36,005 లభిస్తుంది. ఇందులో, ₹12,50,000 – మీరు పెట్టిన పెట్టుబడి. ₹21,86,005 – వడ్డీ ద్వారా వచ్చిన అదనపు మొత్తం. ఈ లాభాలను మిస్ అవకుండా వెంటనే PPF ఖాతా తెరవడం మంచిది.
PPF ఖాతాలో పెట్టిన ఒక్క రూపాయి కూడా పూర్తి భద్రతతో ఉంటుంది
PPF పూర్తిగా ప్రభుత్వ హామీ ఉన్న స్కీమ్ కావున మీరు పెట్టిన ప్రతి రూపాయి సురక్షితమే. అంతేకాకుండా, స్థిరమైన మరియు హామీగల వడ్డీ ఆదాయం లభిస్తుంది.
Related News
PPF లో ముందుగా డబ్బు విత్‌డ్రా చేయొచ్చా?
PPF ఖాతాలో ఉన్న డబ్బును 5 సంవత్సరాలు పూర్తయే వరకు విత్‌డ్రా చేయడం వీలుకాదు. అయితే, 5 సంవత్సరాల తర్వాత కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. ఉదాహరణకు: ఆరోగ్య అత్యవసరాలు, ముగింపు చదువులకు ఖర్చు. ఇంకా, PPF ఖాతాదారులకు లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
PPF ఖాతా ఆన్లైన్‌లో ఎలా ఓపెన్ చేయాలి?
లాగిన్: మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అవ్వాలి. PPF సెక్షన్: Investments లేదా Deposits లో “Open PPF Account” ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. వివరాలు ఇవ్వండి: పెట్టుబడి మొత్తం, నామినీ వివరాలు మొదలైనవి నమోదు చేయాలి. KYC అప్లోడ్ చేయండి: ఆధార్, PAN లేదా అవసరమైన ఇతర డాక్యుమెంట్లు అందించాలి. డిపాజిట్ చేయండి: ₹500 నుంచి ₹1.5 లక్షల వరకు డబ్బును జమ చేయాలి. సబ్మిట్ చేయండి: వివరాలను పరిశీలించి సమర్పించాలి. రిసీట్ సేవ్ చేసుకోవాలి: ఖాతా నిర్ధారణ రసీదు పొందాలి
PPF ఖాతా మీ భవిష్యత్తుకు మంచి పెట్టుబడి ఆప్షన్. భద్రత, మంచి వడ్డీ, పన్ను మినహాయింపులతో కూడిన లాభదాయకమైన స్కీమ్. మీరు ఇంకా ఈ ఖాతా తెరవకపోతే, భారీ లాభాలను కోల్పోతారు.