TG Inter Exams: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు.. అధికారుల కీలక సూచనలు..!!

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష కొనసాగుతుంది. ఈ పరీక్షలు ఈరోజు ప్రారంభమై ఈ నెల 25న ముగుస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా మొదటి, రెండవ సంవత్సరం నుండి మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ మేరకు అధికారులు రాష్ట్రంలో 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 244 హైదరాబాద్‌లో, 185 రంగారెడ్డి జిల్లాలో, 150 మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే ప్రశ్నాపత్రాలు, OMR, సమాధాన పత్రాలు పరీక్షకు వారం ముందు జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. ఈసారి ఒక నిమిషం ఆలస్య నిబంధనను ఇంటర్మీడియట్ బోర్డు సడలించింది. ఈ మేరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి 9.05 నిమిషాల వరకు అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి స్మార్ట్ వాచీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ గాడ్జెట్‌లను అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.