చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లతో ఫోన్ లను తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ మరో ఆసక్తికరమైన ఫోన్ ను తీసుకువస్తోంది.
Infinix ఈ ఫోన్‌ను హాట్ 50 ప్రో ప్లస్ పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ విడుదలకు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కొన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Infinix Hot 50 Pro Plus స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ 16 GB RAM (8 GB ప్రామాణిక + 8 GB వర్చువల్) మరియు 256 GB నిల్వతో అందించబడుతుంది. స్క్రీన్ విషయానికొస్తే, ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని టీజర్ నుండి తెలుస్తోంది.
Related News
భద్రత పరంగా, ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఫిలిప్పీన్స్‌లో ఈ ఫోన్ ఫీచర్లను కంపెనీ టీజ్ చేసింది. ధరపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే త్వరలోనే ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.