సాలరీ పొందేవారికి, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) అమలులో ఉండగా, 2024-25 కేంద్ర బడ్జెట్ లో దీని పరిమితి ₹50,000 నుంచి ₹75,000కి పెంచారు. ఇది ఆదాయపు పన్ను (Income Tax) కట్టే వారి భారం తగ్గించడంతో పాటు, ట్యాక్స్ ఫైలింగ్‌ను సులభతరం చేస్తుంది. అయితే, ఇది అందరికీ వర్తించదు. మరి, ఎవరికి ఈ మినహాయింపు లభిస్తుంది? ఎవరు దీనికి అర్హులు కారు? అన్ని వివరాలు తెలుసుకోండి.
స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమిటి?
2018లో కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ విధానం, సాలరీ పొందేవారికి, పెన్షన్ పొందేవారికి వారి మొత్తం ఆదాయంలోంచి (Gross Salary) ఒక స్థిరమైన మొత్తం తగ్గించి పన్ను భారం తగ్గించే అవకాశం ఇస్తుంది.
అంతకు ముందు, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ లాంటి చిన్న మినహాయింపులు ఉండేవి. వీటి కోసం ఎక్కువ డాక్యుమెంటేషన్, హిసాబ్ పెట్టాల్సి రావడంతో సంబంధిత ఉద్యోగి, కంపెనీ, ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఇబ్బంది కలిగేది. కానీ స్టాండర్డ్ డిడక్షన్ వలన ఇవన్నీ ఫైల్ చేసుకోవడం మరియు ప్రక్రియ సులభతరమైంది.
Related News
2025 బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ మార్పులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌లో నూతన ట్యాక్స్ విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను ₹50,000 నుంచి ₹75,000కి పెంచారు. దీంతో, ₹12.75 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు లభించనుంది.
స్టాండర్డ్ డిడక్షన్ వల్ల కలిగే లాభాలు
- ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సింపుల్ & క్లియర్ – గతంలో చిన్న చిన్న మినహాయింపుల కోసం ఎన్నో డాక్యుమెంట్లు సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటివి అవసరం లేదు.
- పన్ను భారం తగ్గింపు – ఇది ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుంది.
- విశ్రాంతి జీవనాన్ని సులభతరం చేస్తుంది – పెన్షన్ తీసుకునే వారికి ఇది ప్రత్యేకంగా లాభదాయకం.
స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులు ఎవరు?
- సాలరీ తీసుకునే ఉద్యోగులు
- ప్రభుత్వ లేదా ప్రైవేట్ పెన్షనర్లు
- 60 ఏళ్లు దాటిన పెద్దవాళ్లు, 80 ఏళ్లు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లు
స్టాండర్డ్ డిడక్షన్‌కు అర్హులు కానివారు ఎవరు?
- స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులు (Self-Employed, వ్యాపారస్తులు)
- బ్యాంక్ వడ్డీ, ఇంటి అద్దె, పెట్టుబడి లాభాల ద్వారా మాత్రమే ఆదాయం పొందేవారు
మీరు అర్హులా? ఇంకా లేట్ చేయకుండా మీ ఐటీ ఫైలింగ్‌ను ప్లాన్ చేసుకోండి. ఇకపై ₹75,000 వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందే అవకాశం. మీ ఆదాయాన్ని, పన్ను పరిమితిని తెలుసుకుని వెంటనే లాభపడండి.