
రిటైరయ్యాక రెగ్యులర్ ఆదాయం లేక చాలా మంది ఆర్థిక భద్రత గురించి ఆలోచిస్తుంటారు. పింఛన్ ఉన్నా సరే, అది అవసరాలకు సరిపోదు. పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులు, కుటుంబ బాధ్యతలు అన్నీ ఆ సమయంలోనే ఎక్కువవుతాయి. అలాంటి వారికి నమ్మకమైన ఆదాయ మార్గం అవసరం. అందుకే భారత ప్రభుత్వం ప్రత్యేకంగా వృద్ధుల కోసం రూపొందించిన స్కీమ్‌ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం – అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS).
పోస్ట్ ఆఫీస్ ద్వారా నడపబడే ఈ స్కీమ్ ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడినవారి కోసం రూపొందించబడింది. రిటైరయ్యాక మీ చేతికి వచ్చిన పెన్షన్ మొత్తాన్ని లేదా గ్రాట్యుటీ లాంటి డబ్బును ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, మీరు ప్రతి నెలా రెగ్యులర్ ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా, ఇందులో లభించే వడ్డీ రేటు 8.2 శాతం గా ఉండటం గొప్ప విషయం. ఇది మార్కెట్లో ఉన్న ఇతర ఎఫ్డీలతో పోల్చితే చాలా ఉత్తమమైనదిగా చెప్పొచ్చు.
ఈ స్కీమ్‌లో మీరు కనీసం ₹1,000తో ప్రారంభించవచ్చు. గరిష్టంగా ₹30 లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది. ఒక ఉదాహరణగా తీసుకుంటే, మీరు ₹30 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే, సంవత్సరానికి ₹2,46,000 వడ్డీ ఆదాయం వస్తుంది. ఈ స్కీమ్‌లో వడ్డీ ప్రతి మూడు నెలలకోసారి చెల్లించబడుతుంది. అంటే, ప్రతి క్వార్టర్‌కు మీ ఖాతాలోకి ₹61,500 వస్తుంది. దీన్ని నెలవారీగా చూసుకుంటే, మీకు ప్రతి నెల ₹20,500 రెగ్యులర్ ఆదాయం అందుతుంది.
[news_related_post]ఒకవేళ మీరు ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని తీసుకోకుండా, పూర్తి ఐదు సంవత్సరాలు అలాగే వదిలేస్తే, మీ మొత్తం పెట్టుబడి ₹42 లక్షల వరకు పెరుగుతుంది. అంటే వడ్డీ మీద వడ్డీ కలిగి, మీ మొత్తం దాదాపుగా ₹12 లక్షల వరకూ పెరుగుతుంది. ఇది పెట్టుబడి శక్తి ఎంత పెద్దదో చూపిస్తుంది.
SCSS స్కీమ్‌లో పెట్టుబడి గడువు కాలం 5 సంవత్సరాలు. కానీ అవసరమైతే మీరు దీన్ని ఇంకో 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. అంటే మొత్తం 8 ఏళ్ల పాటు ఈ ఆదాయాన్ని కొనసాగించవచ్చు. ఇది వృద్ధులకు ఎంతో ఉపయోగపడే లాంగ్ టెర్మ్ స్కీమ్. SCSS స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, మీరు ఇన్‌కం ట్యాక్స్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే ప్రతి సంవత్సరం ₹1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపుగా పొందే అవకాశం ఉంది. ఇది మీ పొదుపును మరింత పెంచుతుంది.
ఇండియన్ సిటిజన్లు 60 ఏళ్లు దాటిన వారు ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అలాగే ఆర్మీ లేదా డిఫెన్స్ రిటైర్డ్ ఉద్యోగులు కొన్ని ప్రత్యేక నిబంధనలతో 50 ఏళ్లు దాటిన వెంటనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అలాగే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (VRS) తీసుకున్న వారు కూడా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రోజుల్లో వృద్ధాప్యంలోనూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలంటే ఇలా గవర్నమెంట్ గ్యారెంటీతో ఉన్న స్కీమ్‌లు ఎంతో కీలకం. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయాన్ని పొందాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం. పోస్ట్ ఆఫీస్ SCSS స్కీమ్‌ను మీ దగ్గరి పోస్టాఫీసులోనే సులభంగా ప్రారంభించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లతో వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయండి. మీ జీవితం మార్చే పెట్టుబడి ఇదే కావచ్చు…