UPI ఉపయోగించే వాళ్లకు షాకింగ్ న్యూస్… మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ కావొచ్చు….

మీరు Google Pay, PhonePe, Paytm లాంటి UPI యాప్‌లను వాడుతున్నారా? అయితే ఒక పెద్ద మార్పు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ్టి నుంచి ఒక కొత్త రూల్ అమల్లోకి వచ్చింది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ చాలా రోజులుగా యాక్టివ్‌గా లేకపోతే, ఆ నెంబర్ను UPI వ్యవస్థ నుంచి తొలగించబడుతుంది.

ఈ కొత్త రూల్ ఎందుకు వచ్చింది?

పాత నెంబర్‌ లింక్ చేయబడిన అకౌంట్స్ వల్ల UPI ఫ్రాడ్‌లు ఎక్కువయ్యాయి. నెంబర్ ఆఫ్ అయ్యాక, టెలికాం కంపెనీలు అదే నెంబర్‌ను కొత్త వ్యక్తికి ఇస్తాయి. దీని వలన, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన పాత నెంబర్ కొత్త యూజర్ చేతికి వెళ్లే ప్రమాదం ఉంది.
ఈ మోసాలను అరికట్టడానికి, NPCI (National Payments Corporation of India) కొత్త గైడ్‌లైన్ విడుదల చేసింది.
రూల్ ప్రకారం, బ్యాంకులు, UPI యాప్‌లు యాక్టివ్ లేని నెంబర్‌లను ప్రతీ వారం తనిఖీ చేసి, తొలగించాలి.

మీరు వెంటనే చేయాల్సిన 4 ముఖ్యమైన పనులు

మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి. మీ నెంబర్ ఇప్పటికీ యాక్టివ్‌గా ఉందో లేదా, టెలికాం ప్రొవైడర్ (Jio, Airtel, Vi, BSNL) ద్వారా కన్ఫర్మ్ చేసుకోండి. మీ పాత నెంబర్ డి ఆకట్టివ్ అయి ఉంటే, బ్యాంక్‌లో కొత్త నెంబర్ లింక్ చేయించుకోండి. Google Pay, PhonePe, Paytm లాంటి UPI యాప్‌ల్లో కొత్త నెంబర్ అప్‌డేట్ చేయండి.

ఈ మార్పు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది?

NPCI ఏప్రిల్ 1, 2025 నుంచి, లాంగ్ టైం ఇనాక్టివ్‌గా ఉన్న నెంబర్‌లను UPI వ్యవస్థ నుంచి తొలగించనుంది. మీ నెంబర్ పాతదైతే, వెంటనే కొత్త నెంబర్ లింక్ చేయకపోతే, UPI ద్వారా మీ లావాదేవీలు చేయలేరు. అందుకే ఆలస్యం లేకుండా ఇప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్‌డేట్ చేసుకోండి.