సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా: రష్మిక గురించి విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది విజయ్ దేవరకొండ. అలాగే విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక పేరు గుర్తుకు వస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వీరిద్దరూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎంతగానో కలిసిపోయారు. వెండితెరపై వీరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతున్నారు. విజయ్-రష్మిక నిజజీవితంలో ఎప్పుడు కలిసిపోతారు? అని వారి అభిమానులే కాదు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఇదిగో.. ఇదిగో.. అంటూ పరోక్షంగా సూచనలు ఇస్తున్నారు కానీ.. ఇంకా బయటపెట్టలేదు.

ఆనంద్ ఆమెను వదిన అని పిలుస్తాడు

Related News

విజయ్ దేవరకొండ ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి రష్మిక పుష్ప 2 చిత్రాన్ని వీక్షించారు. పండుగలప్పుడు వాళ్ల ఇంటికి కూడా వెళ్తాడు. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రష్మిక వదిన అని పిలుస్తాడు. విజయ్-రష్మిక కలిసి పార్టీలకు వెళ్తారు.. అయితే అది ఎవ్వరూ చూడకుండా విదేశాల్లో మాత్రమే. వారు తరచుగా విమానాశ్రయాలలో కలిసి ఫోటోలు తీసుకుంటారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, విహారయాత్రకు వెళ్లారని సోషల్ మీడియాలో తరచూ వార్తలు వస్తున్నాయి.

ఎలాంటి ఒత్తిడి లేదు

తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావన వచ్చింది. దీనిపై విజయ్ మాట్లాడుతూ.. సరైన సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని, ప్రేక్షకులు ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారో అప్పుడే వెల్లడిస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని తానే వెల్లడిస్తానని చెప్పారు. తాను సినీ నటుడినని, సహజంగా తనపైనా, తన వ్యక్తిగత జీవితంపైనా అందరికీ ఆసక్తి ఉంటుందని, ఇది సహజంగా జరుగుతుందని, ఈ విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని అన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా రష్మికను ప్రస్తావించాడని, ఈ విషయాన్ని త్వరలో ప్రకటిస్తానని, అందుకే ఇద్దరి మధ్య ప్రేమ ఖాయమని, పెళ్లి తంతు అని నెటిజన్లు అంటున్నారు. తాజాగా ఈ విషయంపై రష్మిక కూడా స్పందిస్తూ.. తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించింది.