Hyderabad Style Special Veg Tahri : హైదరాబాద్ స్టైల్ స్పెషల్ వెజ్ తహ్రి ఇలా సింపుల్ గా చెయ్యండి.

Hyderabad Style Special Veg Tahri : Hyderabad Style తారీ.. Hyderabad Style లో చేసే ఈ veg pulao చాలా tasty గా ఉంటుంది. ఇది lunch box లో కూడా చాలా బాగుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వండాలని అనిపించనప్పుడు ఈ తాహ్రీని సులభంగా మరియు రుచికరంగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్లు మరియు వంట చేయని వారు కూడా దీన్ని తయారు చేయవచ్చు. తరచూ అవే వంటకాలకు బదులు కొత్త రుచులు కావాలనుకునే వారు దీన్ని ప్రయత్నించి చూడండి. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారని చెప్పొచ్చు. Hyderabad style లో టహ్రీని రుచికరంగా మరియు సులభంగా ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తయారీకి కావలసిన పదార్థాల గురించి తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Ingredients required for making Hyderabad Style Tahri..

నెయ్యి – 3 స్పూన్లు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 2, లవంగాలు – 2, సజీరా – 1 tsp, దాల్చిన చెక్క – 1 అంగుళం ముక్క, మెంతికూర – 1, జీలకర్ర – 1 tsp, తరిగిన పొడవైన ఉల్లిపాయ – 1, ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు – అరకప్పు, పచ్చి బఠానీలు – 1/4 కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు – 10, క్యారెట్ ముక్కలు – 1/4 కప్పు, వేడి నీళ్లలో నానబెట్టిన మీల్ మేకర్ – 10, తరిగిన బంగాళదుంప – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీస్పూన్, కారం – ఒక టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, టొమాటో ముక్కలు – 1, నీరు – ఒక కప్పు, బాస్మతి బియ్యం గంట నానబెట్టి – ఒక కప్పు, పెరుగు – అరకప్పు, కొత్తిమీర తరిగిన – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు – 4.

Hyderabad Style Tahri Preparation Method..

ముందుగా cooker లో ghee , oil వేసి వేడి చేయాలి. తర్వాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి నిమిషం పాటు వేయించాలి. తర్వాత అందులో కూరగాయల ముక్కలు, ginger garlic past , ఉప్పు, పసుపు వేసి 10 నుంచి 12 నిమిషాలు వేయించాలి. తర్వాత కారం, గరం మసాలా వేసి కలపాలి. ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత tomato pieces , నీళ్లు పోసి కలపాలి. నీరు మరిగిన తర్వాత, బియ్యం వేసి కలపాలి. తర్వాత పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ను మూతపెట్టి, విజిల్ వచ్చే వరకు ఎక్కువ మంట మీద ఉడికించి stove off చేయండి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై సర్వ్ చేయండి. ఇలా చేయడం వల్ల చాలా రుచికరమైన Hyderabadi style తహరీ తయారవుతుంది. దీన్ని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తాహ్రీని చాలా సులభంగా మరియు చాలా రుచికరంగా తయారు చేసి తినవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *