Swiggyపై ₹158 కోట్ల పన్ను షాక్… కంపెనీ షేర్లు 38% డౌన్… ఎందుకంటే..

ఫుడ్, గ్రాసరీ డెలివరీ సంస్థ Swiggy కి ఇంకమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా ₹158 కోట్లకు పైగా పన్ను నోటీసు జారీ చేసింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు కాలానికి సంబంధించి బెంగళూరులోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇంకమ్ ట్యాక్స్ ఈ అసెస్‌మెంట్ ఆర్డర్ ఇచ్చారు.

Swiggyపై పన్ను మోత

Swiggy స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించిన సమాచారం ప్రకారం, కంపెనీ ఆదాయానికి ₹158,25,80,987 అదనంగా చేర్చారు. ప్రధానంగా, ఇంకమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 37 కింద వ్యాపారులకు చెల్లించిన క్యాన్సలేషన్ ఛార్జీలు తిరస్కరించడం, ఇంకమ్ ట్యాక్స్ రీఫండ్‌పై వచ్చిన వడ్డీని ట్యాక్సబుల్ ఇన్‌కమ్‌లో చేర్చకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి ఈ నోటీసు జారీ అయిందని కంపెనీ తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Swiggy ఏమంటోంది?

Swiggy ఈ ఆర్డర్‌పై తమకు బలమైన వాదన ఉందని, అపీల్ దాఖలు చేయడం ద్వారా తమ హక్కులను రక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఈ ఆర్డర్ తమ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదని Swiggy చెబుతోంది. 2014లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా నిలిచింది.

Swiggy షేర్లకు భారీ దెబ్బ

2024 నవంబర్ 13న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయిన Swiggy గత మూడు నెలల్లో 38.88% మేర షేర్ విలువ కోల్పోయింది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుండి కంపెనీ షేర్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Related News

కంపెనీపై భారీ పన్ను బాదుడు, షేర్ల పతనం… Swiggy భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇన్వెస్టర్లకు ఇది గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్? మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.