అమెజాన్ లో ఈ వన్ ప్లస్ ఫోన్ పై భారీ డిస్కౌంట్!

మిడ్-రేంజ్ విభాగంలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా?.. అయితే OnePlus Nord 4 ఉత్తమ ఎంపిక కావచ్చు. ఇది Amazonలో భారీ తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB RAM + 256GB RAM వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.28,999కి జాబితా చేయబడింది. ఇదే సమయంలో ICICI బ్యాంక్ కార్డుతో మీరు ఫోన్‌పై మరింత తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ధర రూ. 25,000 కంటే తక్కువకు తగ్గుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ డిస్కౌంట్ ఆఫర్, ఫీచర్ల గురుంచి చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

డిస్కౌంట్ ఆఫర్

OnePlus Nord 4 స్మార్ట్ ఫోన్ మిడ్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.32,999 కి లాంచ్ అయింది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర ఇప్పుడు రూ.28,999కి అందుబాటులో ఉంది. మరోవైపు.. ఈ ఫోన్ 12GB RAM+256GB స్టోరేజ్ రూ.35,999 లాంచ్ అయితే ప్రస్తుతం దీని ధర అమెజాన్ లో రూ.31,999కి కొనుగోలు చేయొచ్చు. అంటే కంపెనీ రెండు వేరియంట్లపై రూ.4,000 తగ్గింపును ఇస్తోంది. అయితే, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, చెక్అవుట్ వద్ద రూ. 4,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Related News

దీంతో OnePlus Nord 4 8GB RAM వేరియంట్ ధర రూ.24,999కి, 12GB RAM వేరియంట్ ధర రూ.27,999కి చేరుకుంది. ఒకవేళ మీ దగ్గర ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేకపోయినా, ఈ డీల్‌ను ఆస్వాదించాలనుకుంటే, మీ దగ్గర RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉండాలి. RBL బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు కూడా ఇదే విధమైన రూ.4,000 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే.. ఫోన్ పై మొత్తం రూ.8,000 తగ్గింపు ఇస్తున్నారు.

ఫీచర్స్

OnePlus Nord 4 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో గొప్ప పనితీరు, ప్రత్యేకమైన డిజైన్‌ను అందిస్తుంది. ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది డిమాండ్ ఉన్న గేమ్‌లకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఫోన్‌లోని 6.74-అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే అద్భుతమైన వీక్షణ కోణాలను అందిస్తుంది. ఇది మాత్రమే కాదు.. 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రోలింగ్, యానిమేషన్‌ను చాలా సున్నితంగా చేస్తుంది. దీనితో పాటు, Nord 4 శక్తివంతమైన 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది.