అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్ జరుగుతోంది. దీనిలో స్మార్ట్‌ఫోన్‌లపై ఉత్తమ ఒప్పందాలు కనిపిస్తున్నాయి. మీరు కూడా చాలా కాలంగా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, ఈ సేల్ ఉత్తమ డీల్‌లను తీసుకువచ్చింది. అయితే, ఈ సేల్ సమయంలో రూ. 1.5 లక్షల ఖరీదు చేసే శామ్‌సంగ్ ఫోన్ కూడా సగం ధరకే లభిస్తుంది. ఈ సేల్‌లో నచ్చిన 3 డీల్‌లను ఇప్పుడు మనం చూద్దాం.
Samsung Galaxy S24 Ultra
Related News
Samsung గత సంవత్సరం Samsung Galaxy S24 Ultraను రిలీజ్ చేసింది. దీని ధర రూ. 1,29,999గా ఉంది. కానీ, ఇప్పుడు ఎటువంటి ఆఫర్లు లేకుండా కేవలం రూ. 1,05,000కే దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్‌పై రూ.1 వెయ్యి తగ్గింపు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.50 వేల వరకు తగ్గింపు వస్తోంది. ఈ ఫోన్ పై నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ. 5,091 చెల్లించడం ద్వారా పరికరాన్ని సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S24 5G
జాబితాలో రెండవ ఫోన్ Samsung Galaxy S24 5G. దీనిపై Amazon భారీ తగ్గింపును అందిస్తోంది. ఆ కంపెనీ ఈ పరికరాన్ని రూ.79,999కి లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు ఆ ఫోన్‌ను కేవలం రూ.50,999కే కొనుగోలు చేయవచ్చు. మీరు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేస్తే, మీకు రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. నో కాస్ట్ EMI ఆప్షన్ తో నెలకు కేవలం రూ. 2,296 చెల్లించి ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S23 Ultra 5G
అమెజాన్ Samsung Galaxy S23 Ultra 5G పై అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.1.5 లక్షలకు లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు దీన్ని కేవలం రూ.73,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ లో ఇదే అత్యుత్తమ డీల్. ఈ ఫోన్‌పై రూ.2,219 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. నో కాస్ట్ EMIతో నెలకు కేవలం రూ.7,430 చెల్లించడం ద్వారా దానిని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా రూ. 53,200 వరకు ఆదా చేసుకోవచ్చు.