మీ పేరు మీద భూమిని ఎవరో అమ్మేసారా? వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి, లేకపోతే కోట్లు పోతాయి… 

ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ మంచి పెట్టుబడి అవకాశంగా మారింది. భూమి కొనుగోలు భద్రమైన పెట్టుబడి అని చాలా మంది నమ్ముతున్నారు. కానీ, భూ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నకిలీ డాక్యుమెంట్లతో మీ భూమిని ఇతరుల పేరుపై రిజిస్టర్ చేసి అమ్మేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి.ఈ మోసాల వల్ల కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది.మీరు కూడా ఇలాంటి మోసానికి గురయ్యారా? అయితే వెంటనే ఫిర్యాదు చేయండి.

 నకిలీ భూమి రిజిస్ట్రేషన్ పై ఫిర్యాదు ఎలా చేయాలి?

నకిలీ రిజిస్ట్రేషన్‌పై మీరు ఆఫ్లైన్ మరియు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

Related News

 రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసే విధానం

మీ దగ్గర ఉన్న అసలు డాక్యుమెంట్లతో రిజిస్ట్రార్ లేదా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లండి.మీ భూమి రిజిస్ట్రేషన్ మోసపూరితంగా జరిగిందని వివరంగా చెప్పండి.అసలు మీరు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేయండి. అధికారి మీ డాక్యుమెంట్లను పరిశీలించి నకిలీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఎలా చేయాలి?

మీ దగ్గరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయండి.IPC సెక్షన్ 318 ప్రకారం మోసం మరియు నమ్మకద్రోహం కింద కేసు నమోదు చేయించండి.మీ భూమి అక్రమంగా రిజిస్టర్ అయ్యిందని పోలీసులకు చెప్పండి.

ఆన్‌లైన్ ఫిర్యాదు విధానం..

ఉత్తర ప్రదేశ్ లేదా బీహార్ రాష్ట్రానికి చెందినవారు ఉంటే, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.మీ భూమి వివరాలను నమోదు చేసి నేరుగా కంప్లైంట్ లాజ్ చేయండి.

కోర్టులో కేసు వేసి భూమి తిరిగి పొందొచ్చా?

ఒకవేళ మీ భూమి ఇతరుల పేరుపై అక్రమంగా రిజిస్టర్ అయ్యిందని గుర్తిస్తే,సివిల్ కోర్టులో కేసు వేయండి.మీ భూమి మీకే చెందుతుందని కోర్టులో పక్కా ఆధారాలు చూపండి.న్యాయపరమైన చర్యల ద్వారా భూమి తిరిగి పొందొచ్చు.

 ముఖ్యమైన సూచనలు

ఫిర్యాదు చేసేముందు మీ భూమి సంబంధిత అన్ని అసలు డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోండి.ఏ భూమిని కొనే ముందు, అది అమ్మకందారుడి పేరుపై నిజంగా ఉందో లేదో తప్పకుండా ధృవీకరించండి.