కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నివాసమైన తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి పూర్తి దర్శనం కోసం భక్తులు 13 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. దీని కారణంగా టోకెన్లు లేని భక్తులు స్వామి దర్శనం చేసుకోవడానికి 12 గంటలు పడుతోంది. నిన్న 69,746 మంది భక్తులు ఏడుకొండల స్వామిని దర్శించుకున్నారు, 23,649 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు అని టిటిడి అధికారులు వెల్లడించారు.
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

11
Mar