HMPV Virus: చైనా నుంచి భారత్‌కు చేరిన HMPV వైరస్.. కేసులు పెరిగితే పరిస్థితి ఏంటి?

చైనా నుంచి వ్యాపిస్తున్న మరో వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తోంది. ఈ హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ (HMPV) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

భారత్‌లో HMPV తొలి కేసు నమోదు!

భారత్‌లోకి చైనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. HMPV తొలి కేసు నమోదు అయ్యింది. బెంగుళూరులో 8 నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు వైద్య అధికారులు గుర్తించారు. దీనిని కర్నాటక ప్రభుత్వం కూడా అధికారికంగా గుర్తించి.. కేంద్రానికి సమాచారం అందించింది.

Related News

వేగంగా ఇతర దేశాలకు వ్యాపిస్తున్నాయి. ఈ వైరస్‌ను మొదట 2001లోనే గుర్తించారు. ఇప్పుడు చైనాలో దీని ప్రభావం, తీవ్రత పెరిగాయి. ఇన్‌ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే ఈ వైరస్, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారికి ప్రమాదకరం.

ప్రమాదం అంచున చైనా…

ప్రస్తుతం చైనాలో HMPV కేసుల వేగంగా పెరుగుతున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్‌లు పెంచాలని ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో కొన్ని రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. రోగులు, ముఖ్యంగా పిల్లలు పెద్ద క్యూలలో కనిపిస్తున్నారు. పిల్లల వార్డులు నిండిపోయాయి. హాంకాంగ్‌ సహా పొరుగు ప్రాంతాలు కూడా వైరస్‌ వ్యాపిస్తోంది. అక్కడి ఆసుపత్రుల్లో సైతం రద్దీ పెరుగుతోంది.

ప్రపంచ దేశాలకూ ముప్పే!

HMPV కేసులు చైనాకే పరిమితం కాలేదు. నెదర్లాండ్స్, బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో కూడా వైరస్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇంగ్లండ్‌లో శ్వాసకోశ సమస్యలతో ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత సెలవు సీజన్‌లో, ఫ్లూ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య ఒక నెలలోనే నాలుగు రెట్లు పెరిగింది. వేలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారు. పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల గురించి యూకే NHS హెచ్చరికలు జారీ చేసింది.

HMPV అంటే ఏంటి?

హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ (HMPV) అనేది శ్వాసకోశ RNA వైరస్, ఇది ఫ్లూ మాదిరిగానే వ్యాపిస్తుంది. ఇది పారామిక్సోవిరిడే కుటుంబంలో భాగం. దగ్గు, తుమ్ములు లేదా సోకిన వ్యక్తులను తాకడం ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు కరోనావైరస్ లక్షణాలను పోలి ఉంటాయి. అవేంటంటే..

  • – అధిక జ్వరం, దగ్గు
  • – ముక్కుదిబ్బడ
  • – గొంతు నొప్పి
  • – శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • – ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు

ఈ వైరస్ రెండేళ్లలోపు పిల్లలకు, వృద్ధులకు, ఆస్తమా లేదా ఊపిరితిత్తుల వ్యాధులు వంటి ఇతర అనారోగ్యాలు ఉన్నవారికి మరింత ప్రమాదకరం. ఇది చలికాలం సీజన్‌లో మరీ ఎక్కువగా వ్యాపిస్తుంది.

ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి?

HMPV నుంచి రక్షించుకోవడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా చేతులు కడుక్కోండి. సబ్బు, నీరు లేదా హ్యాండ్ శానిటైజర్ వాడండి. వైరస్‌ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల మధ్య తప్పకుండా మాస్క్‌ ధరించండి. మీకు వైరస్‌లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్‌లో ఉండండి. లేదంటే కుటుంబ సభ్యులకు సోకే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు తీవ్రమైతే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించండి.

వైరస్ హిస్టరీ…

HMPV మొట్టమొదట 2001లో నెదర్లాండ్స్‌లో బయటపడింది. అయితే ఈ వైరస్ 60 సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, చల్లని వాతావరణాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. దీంతో ప్రస్తుత వింటర్ సీజన్‌లో వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *