HMPV Virus: దేశంలోకి చొచ్చుకొస్తున్న చైనా HMPV వైరస్.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?

మరో వైరస్ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం నుండి మానవ ప్రపంచం ఇంకా కోలుకుంటుండగా, అలాంటి భయంకరమైన వైరస్ మరొకటి దాడి చేసే ప్రమాదం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

చైనా నుంచి ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. డ్రాగన్ కంట్రీలో పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా మారగా, మహమ్మారి వైరస్ తాజాగా భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ లాగా వైరస్ వ్యాపిస్తుందా? అని చర్చించుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ విజృంభిస్తే మ‌ళ్లీ లాక్‌డౌన్ ప‌రిస్థితులు వ‌స్తాయా అనే దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. వైరస్ అంటే ఏమిటి? దాని ప్రస్తుత స్థితి ఏమిటి? మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందా? తెలుసుకుందాం.

భారతదేశంలోకి ప్రవేశం
హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) చైనాలో విస్తరిస్తోంది. దాంతో పాటు ఇన్‌ఫ్లుఎంజా, ఆర్‌ఎస్‌వీ వైరస్‌లు కూడా వ్యాపిస్తున్నాయి. అక్కడ వైరస్ కేసులు లక్షల్లో పెరుగుతుండగా.. మరణాలు కూడా వందల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చైనా వివరాలు వెల్లడించలేదు. దీంతో అక్కడ వైరస్ ఎలా వ్యాపించిందో తెలియరాలేదు. అయితే పరిస్థితి భయానకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల, HMPV వైరస్ భారతదేశానికి కూడా వ్యాపించింది. బెంగళూరు, కర్ణాటక, అహ్మదాబాద్, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు నలుగురికి పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తోంది.

Related News

దేశంలో వైరస్‌ కేసుల నమోదుపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆందోళన చెందవద్దని సూచించింది. నివారణ చర్యలు తీసుకుంటున్నామని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటించింది. తాము అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది. కేంద్ర ప్రకటన ప్రజల్లో ఆందోళనను దూరం చేయడం లేదు. గతంలో కరోనా వైరస్‌పై ఇలాంటి ప్రకటన రావడంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు HMPV కూడా కరోనాలా వ్యాపిస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

లాక్ డౌన్ అవసరమా?
క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో భార‌త్ అత‌లాకుతలం అవుతున్న విష‌యం తెలిసిందే. లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, కోట్లాది మందికి కరోనా సోకింది. వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించారు. అనేక విడతలుగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మానవ ప్రపంచం ఇళ్లకే పరిమితమైన రోజులు ఇప్పటికీ అందరి కళ్ల ముందు మెరుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందా? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ప్రస్తుతం HMPV వైరస్ వ్యాప్తి గురించి ఏమి చెప్పవచ్చు. శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు ఇంకా వైరస్‌పై అధ్యయనం చేయాల్సి ఉంది. కరోనా వైరస్‌లా వ్యాపించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఈ వైరస్ పిల్లలకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున, పిల్లలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటే మాత్రమే, ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించవచ్చు. లాక్‌డౌన్‌పై కాలమే సమాధానం చెప్పాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *