HMPV Cases: దడ పుట్టిస్తున్న కొత్త వైరస్.. పెరుగుతున్న కేసులు.. కేంద్రం రియాక్షన్ ఏమంటే..

చైనాలో పుట్టుకొచ్చిన మరో కొత్త వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. భారతదేశంలో పెరుగుతున్న HMPV వైరస్ కేసుల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తుంది. భారత్‌లో ఒక్కరోజులోనే ఆరు కేసులు నమోదయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కర్ణాటకలోని బెంగళూరులో 2, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 1, బెంగాల్‌లోని కోల్‌కతాలో 1, చెన్నైలో 2. వీరిలో దాదాపు అందరూ హెచ్‌ఎంపీవీ వైరస్‌ సోకినట్లు పరీక్షించిన చిన్నపిల్లలే. అయితే, పిల్లలలో ఎవరికీ విదేశీ పర్యటన చరిత్ర లేదు. వీరికి ఎలా సోకిందన్న దానిపై వైద్య నిపుణులు ఆరా తీస్తున్నారు. చిన్నారులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వారికి చికిత్స అందిస్తున్నారు.

HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన

Related News

హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం కీలక ప్రకటన చేసింది. HMPV వైరస్ పట్ల తాము చాలా అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా ప్రకటించారు. ఈ వైరస్ కొత్తది కాదని, 2001లో గుర్తించామని వెల్లడించారు.అయితే ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. పొరుగు దేశాల్లో ముఖ్యంగా చైనాలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు. హెచ్‌ఎంపీవీ వైరస్‌పై ఈ నెల 4న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సమీక్ష నిర్వహించిందన్నారు.

లాక్ డౌన్ అవసరమా?

అయితే భారత్‌లో కేసుల సంఖ్య పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసుల కారణంగా దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందని పలువురు సోషల్‌ మీడియాలో చెబుతున్నారు. ప్రస్తుతం, ఈ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో లాక్‌డౌన్ ట్రెండింగ్‌లో ఉంది.

కరోనా లాంటి లక్షణాలు.

అయితే, ఈ కొత్త వైరస్‌కు దాదాపుగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా మాదిరిగా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది న్యుమోనియా మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని చెప్పారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో, ముఖ్యంగా పసిపిల్లల్లో, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ఈ వైరస్ లక్షణాలు త్వరగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్‌ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.