చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీనిని HMPV(హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్) గా చెబుతున్నారు. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
ఇప్పటికే లక్షల మంది వైరస్ వ్యాప్తితో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్లానే ఇది కూడా వేగంగా విస్తరిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా చైనాలోని ఉత్తర ప్రాంతాలలో 14 ఏళ్లలోపు పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తులపై ప్రభావం ఈ వైరస్ ప్రధాన లక్షణాలు. HMPV వైరస్ అనేది కొత్తది కాదు.. 20 ఏళ్ల క్రితమే వైద్యులు దీనిని గుర్తించారు. అయితే ఇప్పుడు దీని వ్యాప్తి కట్టలు తెచ్చుకుంది. 20 ఏళ్లలో దీనికి సంబంధించిన వాక్సిన్, మందు కనుగొనలేదు. ఈ వైరస్ మరింత శక్తివంతంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి.
చైనా నుంచి జపాన్
ఇప్పుడు జపాన్ కి విస్తరించినట్లు ఉన్నట్లుగా చైనా వణికిస్తున్న ఈ వైరస్. జపాన్‌లో బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం.. జపాన్‌లో 7 లక్షల 18 వేల కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ నెలలోనే 94 వేల 259 కొత్త HMP కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. హాంకాంగ్ లోనూ ఈ వైరస్ నమోదైనట్లు కనిపించే కేసులు. కాకపోతే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీంతో హ్యాంగ్ కాంగ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాపించకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. చైనా నుంచి జపాన్, హాంగ్ కాంగ్ దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ఇండియాకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.