హైదరాబాద్‌లో హై అలర్ట్.. పాకిస్తాన్, భారతదేశం మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలో శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే అతిథుల భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను భట్టి విక్రమార్క ఆదేశించారు.
మిస్ వరల్డ్ పోటీలు శనివారం (మే 10) నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అనేక దేశాల నుంచి పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. అందాల పోటీలకు వచ్చే అతిథులకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలో శాంతిభద్రతలపై అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారికి భారీ భద్రత కల్పించాలని ఆయన ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీదారులు బస చేసే హోటళ్లలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్‌కు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
Related News
హైదరాబాద్‌లోని పౌరుల భద్రతపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.. రక్షణ మాక్ డ్రిల్. తెలంగాణ వాసులకు, ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.