హీరో మోటోకార్ప్ ఇటీవలే తన కొత్త డెస్టినీ 125 స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్‌లో డిజైన్ నుండి కొత్త ఫీచర్ల వరకు అప్డేట్ అయ్యాయి. ఈ స్కూటర్ సుజుకి యాక్సెస్ 125 తో నేరుగా పోటీపడుతుంది. ఈ రెండు స్కూటర్లు 125సీసీ ఇంజిన్‌తో అమర్చబడి ఉన్నాయి. ఇప్పుడు సుజుకి యాక్సెస్ 125, హీరో డెస్టిని 125 లో ఏది కొంటె బాగుంటుందో ఇక్కడ చూద్దాం.
ధర
Related News
హీరో మోటోకార్ప్ డెస్టిని 125 ను మూడు వేరియంట్లలో అందిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 80450 నుండి రూ. 90300 వరకు ఉంటుంది. మరోవైపు.. సుజుకి యాక్సెస్ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 80700 నుండి రూ. 91800 వరకు ఉంటుంది.
ఇంజిన్, పవర్
హీరో మోటోకార్ప్ కొత్త డెస్టినీ 125 లో 124.6 సిసి FI టెక్నాలజీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అమర్చబడింది. ఇది 9 బిహెచ్‌పి పవర్, 10.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి CCVT గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. కంపెనీ ప్రకారం.. ఈ స్కూటర్ ఒక లీటరు పెట్రోల్‌తో 59 కి.మీ మైలేజీని ఇవ్వగలదు. మరోవైపు.. సుజుకి యాక్సెస్ 125 లో 124cc ఇంజిన్ ఉంది. ఇది 8.7 PS శక్తిని, 104Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డిజైన్, ఫీచర్లు
హీరో డెస్టిని 125 ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఇప్పుడు చాలా మెరుగ్గా కనిపిస్తుంది. ఇది 190mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. ఇది కాకుండా.. స్కూటర్‌లో 12 అంగుళాల టైర్లు ఉన్నాయి. ఇక డిజిటల్ స్పీడోమీటర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, డిస్టెన్స్ టు ఎంప్టీ, బ్లూటూత్ కనెక్టివిటీ, సీట్ బ్యాక్‌రెస్ట్, లాంగ్ సీట్, i3s టెక్నాలజీ, USB ఛార్జింగ్ పోర్ట్, 19 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉన్నాయి.
సుజుకి యాక్సెస్ 125 లో డ్రమ్, డిస్క్ బ్రేక్‌ల ఎంపిక అందుబాటులో ఉంది. దీనికి 12 టైర్లు ఉన్నాయి. ఇందులో డిజిటల్ కన్సోల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, 21.8 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, USB సాకెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.