బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు జ్యుడీషియల్ కస్టడీ: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పలు సంచలన విషయాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ బెంగళూరు రేవ్ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది హేమ మొదటి నుంచి . అయితే ఈ వ్యవహారంలో తెలుగు సినీ నటి హేమ జోక్యం చేసుకోవడంతో సంచలన విషయాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు శివార్లలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ గురించి తెలుసుకున్న పోలీసులు దానిని మీద రైడ్ చేసారు .
ఆ సమయంలో నటి హేమ కూడా అక్కడే ఉన్నారు. ఆమె పేరు కృష్ణవేణిగా పోలీసుల వద్ద నమోదు కావడంతో ఆమె కేసు పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ఆమెను చూసిన బెంగుళూరు రిపోర్టర్లు అందరూ హేమ అని అనుమానించడంతో హైదరాబాద్‌లో ఛిల్ల్ అవుతున్నట్టు వీడియో విడుదల చేసింది.
బెంగళూరు పోలీసులు వారితో రికార్డులను తనిఖీ చేసి, హేమ వీడియోను చిత్రీకరించిన స్థలం వీడియోలతో పాటు వారి కస్టడీలో ఉన్న ఆమె ఫోటోను విడుదల చేశారు. రెండు ఒకే చోట ఉన్నట్టు తెలిసింది . ఈ నేపథ్యంలో కేసు తప్పుదోవ పట్టించేలా చేసింది అంటూ ఆమెపై మరో కేసు నమోదైంది. రెండు సార్లు విచారణలో విఫలమైన హేమను ఈరోజు బెంగళూరు నుంచి సీసీబీ పోలీసులు వచ్చి విచారించారు. విచారణ నిమిత్తం బురఖా ధరించి వచ్చిన హేమను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం హేమకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులో కేసు నమోదైనందున ఆమెను బెంగళూరు జైలుకు తరలించే అవకాశం ఉంది