విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. శనివారం పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి కీలక ప్రకటన చేసింది.
బంగాళాఖాతంలో తూర్పు-పశ్చిమ వాయుగుండం కేంద్రీకృతమై మధ్య ట్రోపోస్పియర్ స్థాయిల వరకు విస్తరించింది, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. శనివారం పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం (సెప్టెంబర్ 23) వాయువ్య మరియు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వర్ష హెచ్చరిక జారీ చేశారు. రానున్న మూడు నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురం భీం, మెదక్, మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
Related News
ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిర్ధారణ అయింది. మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
AP IMD సంస్థ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, పగో, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.