Heavy Rains in AP: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం .. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలో భారీ వర్షాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం వైపు కదులుతోంది. ఇది ఇప్పటికే బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు కదులుతుందని అంచనా. ఆ తర్వాత తీరం వెంబడి కదులుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఆదివారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

Related News

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అల్పపీడనం ప్రభావం చూపింది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడులో తీరం దాటనున్న అల్పపీడనాలు ఏపీలో తీరం దాటుతున్నాయి. ఈ నెలాఖరులోగా అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని శాటిలైట్ సమాచారం.